చనిపోయి కూడా తండ్రి అవ్వచ్చా.. ఎయిమ్స్ వైద్యులు సరికొత్త పరిశోధన

×

చనిపోయి కూడా తండ్రి అవ్వచ్చా.. ఎయిమ్స్ వైద్యులు సరికొత్త పరిశోధన

వారసత్వం లేకుండా ఒక వ్యక్తి మరణిస్తే, అతని కుటుంబానికి అది తీరని లోటు. అయితే, ఇకపై అటువంటి పరిస్థితుల్లో ఆశ చిగురించవచ్చు. మరణించిన తర్వాత కూడా ఒక వ్యక్తి తండ్రిలా మారి తన వారసత్వాన్ని కొనసాగించే అవకాశం భవిష్యత్తులో రాబోతోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది త్వరలో నిజం కావచ్చు. ఎయిమ్స్ వైద్యులు సరికొత్త పరిశోధనను ప్రారంభించారు, దీని ద్వారా మరణించిన వ్యక్తి నుంచి సజీవంగా ఉన్న వీర్య కణాలను సేకరించి, వాటి ద్వారా సంతానాన్ని కల్పించే దిశగా కృషి చేస్తున్నారు. మధ్యప్రదేశ్ భూపాల్‌లోని మెడిసిన్ మరియు పాతాలజీ విభాగాలు సంయుక్తంగా చేపట్టిన ఈ అధ్యయనానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నిధులు సమకూరుస్తోంది. ఈ పరిశోధనలో భాగంగా, వైద్యులు దాదాపు 600 మంది నుంచి నమూనాలను సేకరించారు. ఆ నమూనాలలో చనిపోయిన వ్యక్తుల నుంచి వీర్య కణాలను విజయవంతంగా సేకరించినట్లు పరిశోధకులు వెల్లడించారు. వారు ఆశించిన విధంగా ఈ వీర్య కణాల ద్వారా సంతానోత్పత్తిని కలిగించగలిగితే, అనుకోని ప్రమాదాలలో తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు తమ వారసత్వాన్ని కొనసాగించేందుకు ఇది ఒక గొప్ప అవకాశంగా మారబోతుంది. ఈ అద్భుతమైన వైద్య పురోగతి సంతాన సాఫల్యత రంగంలో నూతన అధ్యాయాన్ని సృష్టించగలదని భావిస్తున్నారు.

Phani CH