AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిడ్డ రక్షణ కోసం తల్లి తపన.. ఆకట్టుకుంటున్న వీడియో

బిడ్డ రక్షణ కోసం తల్లి తపన.. ఆకట్టుకుంటున్న వీడియో

Phani CH
|

Updated on: Nov 09, 2026 | 5:08 PM

Share

మురసు తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల మధ్య ఖమ్మం జిల్లాలో హృదయాన్ని కదిలించే దృశ్యం కనిపించింది. కల్లూరు మండలం పెద్దకోరుకొండి గ్రామం వద్ద వర్షానికి తలదాచుకునేందుకు ప్రయత్నిస్తున్న కొండముచ్చుల గుంపులో ఓ తల్లి తన చిన్న బిడ్డను ఒడిలో పొదువుకుంది. తాను తడుస్తున్నా బిడ్డకు వర్షం తగలకుండా కాపాడిన తీరు చూపరులను కదిలించింది. ఈ దృశ్యం తల్లిప్రేమకు మరోసారి నిదర్శనంగా నిలిచింది.

మురసు తుఫాన్ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల జనజీవనం అస్తవ్యస్తం కావడంతో పాటు, అన్నదాతలు అపార నష్టాన్ని చవిచూశారు. అయితే కేవలం మనుషులే కాకుండా, మూగజీవాలు కూడా ఈ భారీ వర్షాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇళ్లలోకి వెళ్లే అవకాశం లేని మూగజీవాలు చెట్లను, అడవులను ఆశ్రయించి వర్షానికి తడుస్తూ దిక్కుతోచని స్థితిలో జీవిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఖమ్మం జిల్లాలో ఓ సంఘటన చూపరులను కదిలించింది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పెద్దకోరుకొండి గ్రామం వద్ద ప్రకృతి ప్రకోపానికి తలవంచని ఒక అద్భుతమైన అమ్మ ప్రేమ వెలుగు చూసింది. ఓవైపు కొండముచ్చుల గుంపు వర్షానికి తడవకుండా తలదాచుకునే ప్రయత్నం చేస్తుండగా, అందులో ఒక తల్లి కొండముచ్చు తన చిట్టి బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకున్న తీరు ఎవరినైనా కదిలిస్తుంది. జోరువానలో ఎక్కడ తల దాచుకోవాలో తెలియని దయనీయ పరిస్థితి ఉన్నా.. ఆ తల్లికి తన బిడ్డే లోకమైంది. వర్షం నుంచి తన బిడ్డ తడవకుండా.. ఒడిలో భద్రంగా పొదువుకుంది. తనకు ఎన్ని కష్టాలు ఎదురైనా బిడ్డను గుండెలకు హత్తుకుని కాపాడుకున్న తీరు చూపర్లను విస్మయానికి గురిచేసింది. మనుషులైనా, మూగజీవాలైనా అమ్మ తనంలో మాత్రం ఎలాంటి తేడా ఉండదని ఈ దృశ్యాలు మరోసారి నిరూపించాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు మించిన రాబడినిచ్చే ప్రభుత్వ పథకాలు.. 100% సేఫ్‌

మ్యాగీ అమ్మి రోజుకు రూ.14 వేలు సంపాదన

Follow Us