భారత రైల్వే
భారత రైల్వే.. దేశంలో అతిపెద్ద రవాణా సంస్థ. ప్రతి రోజు లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా భారత రైల్వే శాఖ ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు రైళ్లను నడపడం, ఐఆర్‌సీటీసీలో సులభంగా టికెట్స్ లభించేలా వివిధ చర్యలు చేపడుతోంది రైల్వేశాఖ. అంతేకాకుండా ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం అందించడంలో కూడా చర్యలు చేపడుతూనే ఉంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ మధ్య కాలం నుంచి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలోని వివిధ ప్రధాన నగరాలను కలుపుతూ ఈ వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే రైల్వే వ్యవస్థలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు పనులను పునరుద్దరిస్తోంది రైల్వే. రానున్న రోజుల్లో వందేభారత్ తరహాలో తక్కువ ఛార్జీలతో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాకుండా రైల్వే స్టేషన్‌లలో ఎలాంటి మోసాలు జరుగకుండా ప్రత్యేక నిఘా ఉంచుతుంది రైల్వే శాఖ.