AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: ఈ ఒక్క ఆప్షన్ ఎంచుకుంటే ఖచ్చితంగా సీటు కన్ఫార్మ్.. ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకునేవారికి తెలియని సీక్రెట్..

ఆన్‌లైన్‌లో టికెట్ బుకింగ్ చేసుకునే ప్రయాణికులకు రైల్వేశాఖ మంచి అవకాశం కల్పిస్తోంది. అదే వికల్ప్ ఆప్షన్. ఇది ఎంచుకంటే మీకు సీటు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా మీరు ఒకవేళ ప్రయాణం చేయకపోతే రీఫండ్ కూడా పొందవచ్చు. ఈ ఫీచర్ గురించి వివరాలు..

Indian Railways: ఈ ఒక్క ఆప్షన్ ఎంచుకుంటే ఖచ్చితంగా సీటు కన్ఫార్మ్.. ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకునేవారికి తెలియని సీక్రెట్..
Train
Venkatrao Lella
|

Updated on: Mar 03, 2026 | 11:47 AM

Share

రైళ్లల్లో తరచూ లక్షలాది మంది ప్రయాణిస్తూ ఉంటారు. దేశ నలుమూలకు రైల్ కనెక్టివిటీ అందుబాటులో ఉండగా.. రైళ్లల్లో రద్దీ విపరీతంగా ఉంటుంది. ఇక పండుగ సమయాలు, ఆక్సుపెన్సీ ఎక్కువగా ఉండే రూట్లలో రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో నెల రోజుల ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అత్యవసర ప్రయాణం చేయాలంటే తత్కాల్ టికెట్లు ఆన్‌లైన్‌లో ముందు రోజే రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. టికెట్ కన్ఫామ్ అవ్వకపోతే వెయిటింగ్ లిస్ట్ లేదా ఆర్ఏసీ జాబితాలో పడిపోతుంది. రైలు బయలుదేరే కొన్ని గంటల మందు విడుదల చేసే ఛార్ట్‌ ప్రిపేర్ అయ్యేలోపు కూడా మీ పీఎన్‌ఆర్ స్టేటస్ వెయిటింగ్ లిస్ట్ అని చూపిస్తే మీరు ప్రత్యామ్నయ ఏర్పాట్లను చేసుకోవాల్సి ఉంటుంది. అదే ఆర్‌ఏసీ కోటాలో బెర్త్ కేటాయిస్తే వేరేవారితో బెర్త్ షేర్ చేసుకోవాల్సి ఉంటుంది.

వికల్ప్ ఆప్షన్

అయితే ప్రయాణికుల కోసం వికల్ప్ అనే స్కీమ్‌ను రైల్వేశాఖ తీసుకొచ్చింది. దీని ద్వారా టికెట్ కన్ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు ప్రయాణించే రైల్లో కాకపోయినా అదే రూట్లోని వేరే ట్రైన్‌లో అయినా సీటు పొందే అవకాశం ఉంటుంది. దీని కోసం మీరు ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే సమయంలో వికల్ప్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఐఆర్‌సీటీసీ పోర్టల్ లేదా యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునేవారికి మాత్రమే ఈ ఆప్షన్ కనిపిస్తుంది. మీరు టికెట్ బుకింగ్ సమయంలో దీనికి ఎంచుకోవడం ద్వారా అదే రూట్‌లో ప్రయాణించే వేరే ట్రైన్లలో అయినా సీటు పొందే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా అదే రూట్‌లో వేరే స్టేషన్ల నుంచి బయల్దేరే ట్రైన్లలో అయినా సీటు లభిస్తుంది.

తత్కాల్ టికెట్లకు కూడా వికల్ప్

ఇక తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే సమయంలో కూడా వికల్ప్ ఆప్షన్ ఉపయోగపడుతుంది. తత్కాల్ టికెట్లు వెయింట్ లిస్టులో పడిపోయిన సమయంలో వికల్ప్ ఆప్షన్ ఎంచుకోవడం వల్ల టికెట్ కన్పార్మ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. వేరే రైల్లో మీరు బెర్త్ కన్ఫార్మ్ అయితే ప్రస్తుత రైల్లోని వెయిటింగ్ లిస్ట్ నుంచి మీ పేరును తొలగిస్తారు. ఇక వేరే రైలులో బెర్త్ కన్ఫార్మ్ అయ్యాక మీరు ప్రయాణించకపోతే రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. చాలామందికి తెలియక ఈ ఆప్షన్ ఎంచుకోవడం లేదు. దీంతో టికెట్ కన్ఫార్మ్ అవ్వక చివరి నిమిషంలో వేరే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇదే వికల్ప ఆప్షన్ ఎంచుకోవడం వల్ల మీకు అదే రూట్‌లో వేర్వేరు స్టేషన్ల నుంచి బయల్దేరే ట్రైన్లలో మీకు బెర్త్ లభించవచ్చు.

Follow Us
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..