AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: ట్రైన్‌లో లోయర్ బెర్త్ కావాలా..? ఈ సింపుల్ ట్రిక్ చూడండి.. అలా చేస్తే మీకే నష్టం

82 ఏళ్ల వృద్దురాలికి ట్రైన్‌లో అప్పర్ బెర్త్ రావడంపై ఓ నెటిజన్ ఎక్స్‌లో రైల్వేశాఖను ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన ఐఆర్‌సీటీసీ.. రైల్వేశాఖ నియమాల గురించి స్పష్టత ఇచ్చింది. టికెట్లు బుక్ చేసుకునే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Indian Railways: ట్రైన్‌లో లోయర్ బెర్త్ కావాలా..? ఈ సింపుల్ ట్రిక్ చూడండి.. అలా చేస్తే మీకే నష్టం
Irctc Ids
Venkatrao Lella
|

Updated on: Mar 02, 2026 | 8:53 AM

Share

ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్ల బుకింగ్‌కు సంబంధించి రైల్వేశాఖ క్లారిటీ ఇచ్చింది. టికెట్లు బుక్ చేసుకున్నవారికి బెర్త్‌ల కేటాయింపుపై స్పష్టత ఇచ్చింది. టికెట్లు బుక్ చేసుకున్నవారికి బెర్త్‌లు ఎలా కేటాయించాలనే దానిపై రైల్వేశాఖ పలు నిబంధనలు పాటిస్తోంది. ప్రయాణికులకు కేటగిరీల వారీగా బెర్త్‌లు కేటాయించే ప్రక్రియ ప్రస్తుతం అమల్లోకి ఉంది. ఇందుకోసం కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ వ్యవస్థను రైల్వేశాఖ ప్రవేశపెట్టింది. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకునే సమయంలో ప్రయాణికుడు ఇచ్చే వివరాలు, ఎంపికలను బట్టి సిస్టమ్ ఆటోమేటిక్‌గా బెర్త్ లను కేటాయిస్తూ ఉంటుంది. దీంతో మీకు ఏ బెర్త్ కావాలనేది టికెట్ బుక్ చేసుకునే సమయంలో ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ ఎంపికను బట్టి సిస్టమ్ బెర్త్‌ల కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. తాజాగా ఈ నియమాలపై రైల్వేశాఖ మరోసారి స్పష్టత ఇస్తూ ఓ ప్రకటన జారీ చేసింది.

82 ఏళ్ల వృద్దురాలికి అప్పర్ బెర్త్

60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు, 45 ఏళ్లు దాటిన మహిళలు, గర్బిణులు ట్రైన్లలో లోయల్ బెర్త్‌లు పొందే అవకాశముంది. కానీ తాజాగా 82 ఏళ్ల వృద్దురాలికి ట్రైన్‌లో పైబెర్త్ కేటాయించారు. ఓ వ్యక్తి దీనిపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి రైల్వేశాఖను ప్రశ్నించాడు. “82 ఏళ్ల మహిళ కోసం ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేశాను. చాలా సీట్లు అందుబాటులో ఉన్నప్పటికీ అప్పర్ బెర్త్ కేటాయించారు. ఇప్పుడు అదే లోయర్ బెర్త్‌లను ప్రీమియం తత్కాల్ కేటగిరిలో అధిక ధరలకు అమ్ముతున్నారు. సీనియర్ సిటిజన్ కోటాను తొలగించడంలో కూడా మంచి పని చేశారు” అంటూ ఐఆర్‌సీటీసీ, రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ట్యాగ్ చేస్తూ ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. దీనిపై ఐఆర్‌సీటీసీ క్లారిటీ ఇచ్చింది.

అలా చేస్తేనే లోయర్ బెర్త్ కేటాయింపు

“కంప్యూటరైజ్డ్ విధానం ద్వారా 45 ఏళ్లు దాటిన మహిళలకు, సీనియర్ సిటిజన్లకు ఆటోమేటిక్‌గా లోయర్ బెర్త్‌లు కేటాయించే నిబంధన అమల్లో ఉంది. అయితే బెర్త్‌ల లభ్యతపై ఇది ఆధారపడి ఉంటుంది. మీరు టికెట్ బుక్ చేసుకునే సమయంలో లోయర్ బెర్త్‌ కావాలని ప్రయాణికులు ఎంచుకోవాలి. అలాంటి సమయంలో లోయర్ బెర్త్ ఖాళీగా ఉంటేనే సిస్టమ్ కేటాయిస్తుంది. ఇక లోయర్ బోర్త్ ఉంటేనే టికెట్ కన్పార్మ్ అయ్యేలా ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఇలా చేస్తేనే లోయర్ బెర్త్ కేటాయించే అవకాశముంటుంది. ఇలాంటివి ఎంచుకోకపోతే బెర్త్‌ల లభ్యతను బట్టి అప్పర్ బెర్త్ ఆటోమేటిక్‌గా సిస్టమ్ కేటాయించవచ్చు. దీంతో టికెట్ బుక్ చేసుకునే సమయంలో మీరు బెర్త్ ఎంపికను ఎంచుకోకపోతే అప్పర్ బెర్త్ రావొచ్చు” అని ఐఆర్‌సీటీసీ పేర్కొంది.

Follow Us