అన్నమయ్య జిల్లా పీలేరు మండలం ముడుపుల వేముల గ్రామంలో పాత కక్షలతో ఓ మహిళా రైతు అమరావతికి తీరని నష్టం వాటిల్లింది. ఆరు ఎకరాల్లో సాగు చేసిన బొప్పాయి పంటపై గుర్తుతెలియని వ్యక్తులు విషప్రయోగం చేయడంతో సుమారు 8 లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. నాలుగున్నర నెలల కష్టం నిష్ప్రయోజనమైంది.