AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. ఈ కొండచిలువ తెలివి మామూలుగా లేదుగా

వామ్మో.. ఈ కొండచిలువ తెలివి మామూలుగా లేదుగా

Phani CH
|

Updated on: Apr 16, 2026 | 6:44 PM

Share

విశాఖ కైలాసగిరిలో వేసవి తాపానికి ఓ కొండచిలువ పక్షుల నీటి తొట్టెను వేట స్థలంగా మార్చుకుంది. తెలివిగా నీటిలో దాగి, దాహం తీర్చుకోవడానికి వచ్చిన కాకిని వేటాడింది. పర్యాటకుల సమాచారంతో స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్ రెస్క్యూ చేశారు. కొండచిలువ తెలివికి పర్యాటకులు ఆశ్చర్యపోయారు. ఎండ తీవ్రత దృష్ట్యా నీటి వనరుల వద్ద అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

వేసవి తాపానికి మనుషులే కాదు, మూగజీవాలు కూడా అల్లాడిపోతున్నాయి. ఈ క్రమంలోనే విశాఖలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కైలాసగిరిపై ఒక వింత ఘటన జరిగింది. పక్షుల దాహం తీర్చడం కోసం ఏర్పాటు చేసిన నీటి తొట్టెను, ఒక భారీ కొండచిలువ తన ‘హంటింగ్ గ్రౌండ్’గా మార్చుకుంది. సాధారణంగా పాములు చల్లదనం కోసం నీరుఉన్న ప్రాంతాలను ఆశ్రయిస్తాయి. కానీ, ఈ కొండచిలువ మాత్రం ఒక అడుగు ముందుకు వేసి, ఏకంగా నీటి తొట్టెలోనే తిష్ట వేసింది. దాహం తీర్చుకోవడానికి వచ్చే పక్షులను సులభంగా వేటాడేందుకు ఇది పక్కా ప్లాన్ వేసింది. నీటిలో కలిసిపోయి, కదలకుండా నక్కి ఉండటంతో పక్షులు అది అక్కడ ఉన్నట్లు గుర్తించలేకపోయాయి. తొట్టెలో ఏదో వింతగా ఉండటాన్ని గమనించిన పర్యాటకులు వెంటనే స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్‌కు సమాచారం అందించారు. ఆయన వచ్చి ఆ కొండచిలువను రెస్క్యూ చేసిన తర్వాత అసలు విషయం బయటపడింది. ఆ కొండచిలువ అప్పటికే ఒక కాకిని వేటాడి మింగేసి, హాయిగా నీటిలో సేదతీరుతూ మరో వేట కోసం ఎదురుచూస్తున్నట్లు కిరణ్ గుర్తించారు. తన కెరీర్‌లో ఒక కొండచిలువ ఇంత తెలివిగా వేట సాగించడం ఎప్పుడూ చూడలేదంటూ స్నేక్ క్యాచర్ కిరణ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొండచిలువ తెలివిని చూసి పర్యాటకులు, స్థానికులు ముక్కున వేలేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎండల తీవ్రత దృష్ట్యా ఇలాంటి నీటి వనరుల వద్ద జంతువులు, పాములు పొంచి ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు, పర్యాటకుల జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇరాన్ చమురుపై అమెరికా ఉక్కుపాదం.. సడలింపుల పొడిగింపునకు ‘నో’

TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. సర్వదర్శనం టోకెన్ల జారీలో మార్పులు

ఆరేళ్ల బాలుడికి కృష్ణానదిలోకి విసిరేసిన తండ్రి.. కారణం తెలిస్తే షాకవుతారు

Singer Chitra: సింగర్ చిత్ర భావోద్వేగం.. గుండెను పిండేసేలా పోస్ట్

Mushroom: వామ్మో.. ఇది పుట్ట గొడుగా.. గొడుగా ??

Follow Us