AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. సర్వదర్శనం టోకెన్ల జారీలో మార్పులు

TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. సర్వదర్శనం టోకెన్ల జారీలో మార్పులు

Phani CH
|

Updated on: Apr 16, 2026 | 5:55 PM

Share

తిరుమల దర్శనం కోసం వేసవిలో పెరిగిన భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టీటీడీ కీలక మార్పులు చేసింది. తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్ల సమయాలు మారాయి. ఇకపై ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచే శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్‌లలో టోకెన్లు పొందవచ్చు. ఎండల నుండి భక్తులకు ఉపశమనం, మెరుగైన దర్శన అనుభవం కోసం ఈ నిర్ణయం. ఆధార్ తప్పనిసరి.

సమ్మర్‌ సీజన్‌ మొదలైంది.. విద్యార్ధుల పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి.. దీంతో తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అలర్ట్ జారీ చేసింది. తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్ల సమయాల్లో కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో మధ్యాహ్నం నుంచి టోకెన్లు ఇచ్చే విధానానికి స్వస్తి పలికి, భక్తుల సౌకర్యార్థం ఇకపై ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుంచే కౌంటర్లు ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. తిరుపతికి చేరుకునే సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా మూడు ప్రధాన కేంద్రాల్లో ఈ టోకెన్లను అందుబాటులో ఉంచారు. రైల్వే స్టేషన్‌ ఎదురుగా ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ లోను, రైల్వే స్టేషన్‌ వెనుక ఉన్న విష్ణు నివాసం లోనూ, అలాగే అలిపిరి మెట్లమార్గం వద్ద భూదేవి కాంప్లెక్స్‌లో ఈ టోకెన్లను అందుబాటులో ఉంచారు. గతంలో స్వామివారి సర్వదర్శనానికి టోకెన్ల కోసం మధ్యాహ్నం వరకు వేచి ఉండాల్సి రావడంతో భక్తులు ఎండలో ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఉదయాన్నే టోకెన్లు జారీ చేయడం వల్ల, భక్తులు వాటిని తీసుకుని నేరుగా తిరుమలకు వెళ్లడమో లేదా ఇతర పనులు చూసుకోవడమో చేయవచ్చని అధికారులు తెలిపారు. దీనివల్ల క్యూలైన్లలో గంటల తరబడి నిలబడాల్సిన అవసరం తగ్గుతుంది. వారాంతాలు, పండుగ రోజుల్లో రద్దీ విపరీతంగా ఉంటుందని, కావున భక్తులు మారిన సమయాలను గమనించి తమ యాత్రను ప్లాన్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. ఆధార్ కార్డు తప్పనిసరిగా చూపించి ఈ టోకెన్లను పొందాల్సి ఉంటుంది. తిరుమల ప్రయాణానికి సిద్ధమయ్యే భక్తులు ఈ మార్పును గమనించి సహకరించాలని అధికారులు కోరారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆరేళ్ల బాలుడికి కృష్ణానదిలోకి విసిరేసిన తండ్రి.. కారణం తెలిస్తే షాకవుతారు

Singer Chitra: సింగర్ చిత్ర భావోద్వేగం.. గుండెను పిండేసేలా పోస్ట్

Mushroom: వామ్మో.. ఇది పుట్ట గొడుగా.. గొడుగా ??

గ్యాస్‌ కష్టాలు.. ఆటోలో సిలిండర్లను లాక్కెళ్ళిన మహిళలు

వింత దొంగను పట్టించిన సీసీ కెమెరా.. ఏం చేశాడో తెలుసా

Published on: Apr 16, 2026 05:53 PM
Follow Us