తిరుమల తిరుపతి దేవస్థానం

తిరుమల తిరుపతి దేవస్థానం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు మరో 12 ఆలయాలను నిర్వహించే ఓ స్వతంత్ర ప్రభుత్వ సంస్థ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఇది పనిచేస్తుంది. టీటీడీ శ్రీవారి ఆలయ నిర్వహణతో పాటు పలు ధార్మిక, సాంస్కృతిక, విద్యా, వైద్య సేవా కార్యక్రమాలు.. హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు చేపడుతోంది. బ్రిటీష్ హయాంలో 1933లో టీటీడీ తొలి పాలకమండి ఏర్పాటయ్యింది. ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందు ఆలయ పాలకమండలి ఇదే కావడం విశేషం. 2024నాటికి టీటీడీ ఆస్తుల విలువ దాదాపు రూ.3 లక్షల కోట్లుగా ఉంది. వాటికన్ సిటీ తర్వాత అత్యధిక ఆర్థిక వనరులు టీటీడీ సొంతం. టీటీడీలో ప్రస్తుతం 16 వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.

సనాతన ధర్మాన్ని ప్రోత్సహించేందుకు టీటీడీ 2019లో శ్రీవాణి ట్రస్టును నెలకొల్పింది. కొత్త ఆలయాల నిర్మాణం, పాత ఆలయాల పునరుద్ధరణ చేపట్టే లక్ష్యంతో ఇది పనిచేస్తోంది. దీని ద్వారా దేశ విదేశాల్లో పలు కొత్త ఆలయాలను నిర్మించారు

ఇంకా చదవండి

Tirupati Laddu Row: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. లడ్డూ కల్తీ కేసుపై సిట్ విచారణ తాత్కాలికంగా నిలిపివేత..

తిరుమల లడ్డూ కల్తీ వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.. లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.. మరోవైపు సుప్రీంకోర్టులో సైతం విచారణ జరుగుతోంది.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం సంచలన నిర్ణయం తీసుకుంది. కల్తీ నెయ్యి వివాదంపై సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేసింది.