AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు ఇకపై నాణ్యమైన లడ్డూ.. టీటీడీ కొత్త రూల్స్.. ఇక అలా కుదరదు..

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీ విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూ తయారీ, నెయ్యి సరఫరా విషయంలో కఠిన నిబంధనలను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఇప్పటివరకు ఉన్న రూల్స్‌లో మార్పులు చేసింది. భక్తులకు నాణ్యమైన లడ్డూలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు ఇకపై నాణ్యమైన లడ్డూ.. టీటీడీ కొత్త రూల్స్.. ఇక అలా కుదరదు..
Tirumala
Venkatrao Lella
|

Updated on: Feb 18, 2026 | 8:29 AM

Share

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు నాణ్యమైన లడ్డూలు అందించేందుకు టీటీడీ ప్రయత్నాలు చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో లడ్డూలో కల్తీ జరిగిందనే ఆరోపణల క్రమంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. స్వామివారి లడ్డూ తయారీ, నెయ్యి కొనుగోలు విధానంలో పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. లడ్డూ, నెయ్యి నాణ్యతను నిర్ధారించేందుకు పరీక్షలు నిర్వహించడం, నెయ్యి సరఫరా కంపెనీలపై ప్రత్యేక ఫోకస్ పెట్టడం, టెండర్లలో పారదర్శకత వంటి నిర్ణయాలు తీసుకుంది. తిరుమల శ్రీవారి లడ్డూ పవిత్రతను కాపాడేందుకు ఈ నిర్ణయాలు ఉపయోగపడతాయని టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక నుంచి భక్తులకు నాణ్యమైన లడ్డూ అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది.

కొత్త నిబంధనలు ఇవే..

-నెయ్యి సరఫరా సమయంలో నాణ్యత తగ్గకుండా చర్యలు -సరఫరా కంపెనీలు ఎఫ్‌ఎస్ఎస్‌ఎఐ, ఎన్‌డీడీబీ నిబంధనలకు అనుగుణంగా అన్ని టెస్టులు పాస్ అవ్వాల్సి ఉంటుంది -ఆవు నెయ్యి కొనుగోలు విషయంలో ఎన్‌డీడీబీ నిర్ణయించిన ధరల ప్రకారం కొనుగోలు – డెయిరీ కంపెనీలకు టెండర్ల కేటాయింపుల్లో పారదర్శకత -టీటీడీకీ నెయ్యి సరఫరా చేసే ట్యాంకర్లకు జీపీఎస్ లాక్ సిస్టమ్ -డెయిరీ ప్రాసెసర్ల తయారీ సిద్దతను అంచనా వేసేందుకు ఎంఆర్‌ఎల్ స్కోర్ విధానం -మిల్ ఫ్యాట్ ప్యూరిటీ టెస్టులు, సెన్సరీ పారామీటర్స్, ఎఫ్‌ఎస్ఎస్ఆర్‌ నిబంధనలు మరింత కఠినతరం -1500 కిలోమీటర్ల నెయ్యి సేకరణ పరిధిని 800 కిలోమీటర్లకు తగ్గింపు

ప్రస్తుతం నెయ్యి సరఫరా చేస్తున్న కంపెనీలు

ప్రస్తుతం టీటీడీకి మదర్ డెయిరీ, ఇందాపూర్ డెయిరీ, సంగం డెయిరీ నెయ్యి సరఫరా చేస్తున్నాయి. ఈ సంస్థల ద్వారా 65 లక్షల కిలోల నెయ్యి సేకరణకు టీటీడీ సిద్దమైంది. 2024-25 మధ్య నిర్వహించిన టెండర్లలో ఆ కంపెనీలు అర్హత సాధించాయి. ఏడు విడతలుగా టెండర్లు నిర్వహించగా.. నాలుగు టెండర్లు నందిని, మదర్ డెయిరీ రెండు, సంగం డెయిరీ ఒక టెండర్లు దక్కించుకున్నాయి.  నందిని డెయిరీని తప్పించారనే ప్రచారంలో వాస్తవం లేదని టీటీడీ స్పష్టం చేసింది. కమిషన్ల కోసం నెయ్యి సరఫరాకు రేటు పెంచామనే వార్తల్లో నిజం లేదని,  ఆవు నెయ్యి హోల్‌సేల్ మార్కెట్లో ధరలను బట్టి చెల్లిస్తున్నట్లు తెలిపింది. 2016లో ఆవు పాల ధర రూ.17 నుండి రూ.20 మధ్య ఉండగా.. ఆవు నెయ్యి ధర రూ.278గా ఉండేది. ఇప్పుడు ఆవు పాల ధర రూ.42కు చేరుకుంది. దీంతోఆవు నెయ్యి మార్కెట్ ధరలు కూడా రూ.658కు పెరిగాయి. శ్రీవారి లడ్డూల నాణ్యతకు తాము కట్టుబడి ఉన్నామని, తిరుమల పవిత్రతను రక్షించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు.

Follow Us
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర