ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే మీ లివర్ తళతళ..
27 July 2026
TV9 Telugu
TV9 Telugu
కొవ్వు కాలేయం (ఫ్యాటీ లివర్) సమస్య నేటి కాలంలో వేగంగా పెరుగుతోంది. ఈ సమస్యను అధిగమించడంలో జీలకర్ర నీరు (జీరా వాటర్) ఎంతో మేలు చేస్తాయి
TV9 Telugu
కొన్ని అధ్యయనాలు జీలకర్రలోని బయోయాక్టివ్ సమ్మేళనాలు కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గించడంలో తోడ్పడతాయని సూచిస్తున్నాయి
TV9 Telugu
అయితే ఇది చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని గుర్తుంచుకోవాలి. జీలకర్రలోని సహజ సమ్మేళనాలు కాలేయ కొవ్వు జీవక్రియను సమతుల్యం చేస్తాయి
TV9 Telugu
అయితే ఇది ఫ్యాటీ లివర్ ప్రారంభ దశలో కొంత ప్రయోజనం కలిగించడంలో సహాయపడతాయి. జీలకర్ర నీరు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది
TV9 Telugu
జీలకర్రలోని పదార్థాలు జీర్ణ ఎంజైమ్‌ల పనితీరును ప్రోత్సహించడం ద్వారా కొవ్వులు, ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్ల జీర్ణక్రియను సులభతరం చేస్తాయి
TV9 Telugu
దీంతో కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో, శరీరంలో కొవ్వు నిల్వలను తగ్గించడంలోనూ మేలే
TV9 Telugu
ఫాస్టింగ్ షుగర్ స్థాయిలను నియంత్రించడం, బరువు తగ్గడంలో కూడా కొంత మేర ఉపయోగపడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు తాగితే ప్రయోజనం ఉంటుంది
TV9 Telugu
దీంతో పోషకాలు సులభంగా లభించడంతోపాటు జీవక్రియ వేగంగా ప్రారంభమవుతుంది. అలాగే పేగులు, కాలేయం మధ్య సమన్వయం మెరుగుపడటానికి కూడా ఇది తోడ్పడుతుంది
మరిన్ని వెబ్ స్టోరీస్
చూస్తేనే నోరూరుతుంది కదూ.. తింటే లాభాలూ ఉన్నాయ్
కుండ Vs ఫ్రిజ్.. ఎండల్లో ఏ నీళ్లు ఆరోగ్యానికి మంచిది?
పెరుగు త్వరగా పులుస్తుందా? మీ వంటగదిలో ఈ చిన్న మార్పు చేయండి