పెరుగు త్వరగా పులుస్తుందా? మీ వంటగదిలో ఈ చిన్న మార్పు చేయండి
15 April 2026
TV9 Telugu
TV9 Telugu
వేసవిలో రోజూ తీసుకునే ఆహారాల్లో పెరుగు ముందు వరుసలో ఉంటుంది. ఇది తేలికగా జీర్ణమవడమే కాకుండా శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. అయితే వేసవిలో పెరుగు త్వరగా పులిసిపోతుంటుంది
TV9 Telugu
రాత్రి తోడు పెట్టిన పెరుగు ఉదయానికి ఎక్కువగా పులిసిపోవడం చాలా మందికి ఎదురయ్యే పరిస్థితి. అధిక ఉష్ణోగ్రతల వల్ల ఫర్మెంటేషన్ వేగంగా జరిగి పెరుగు రుచి మారిపోతుంది
TV9 Telugu
కానీ కొన్ని చిన్న మార్పులతో ఈ సమస్యను సులభంగా నియంత్రించవచ్చట. వేసవిలో పెరుగు త్వరగా పులవడానికి ప్రధాన కారణం ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటమే
TV9 Telugu
వేడి వాతావరణంలో బాక్టీరియా వేగంగా పెరిగి పాలలోని చక్కెరలను లాక్టిక్ ఆమ్లంగా త్వరగా మార్చేస్తుంది. దీంతో పెరుగు త్వరగా పులుపు రుచిని పొందుతుంది
TV9 Telugu
ఒకసారి ఈ ప్రక్రియ మొదలైతే ఫ్రిజ్‌లో పెట్టకపోతే అది ఇంకా కొనసాగుతుంది. ఈ సమస్యను తగ్గించడానికి ఫర్మెంటేషన్ సమయాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం
TV9 Telugu
వేసవిలో పెరుగు త్వరగా తయారయ్యే అవకాశం ఉంది. పెరుగు తయారు కాగానే వెంటనే ఫ్రిజ్‌లో పెట్టడం మంచిది. అవసరంలేకుండా రాత్రంతా బయట ఉంచితే అది మరింత పులిసిపోతుంది
TV9 Telugu
తోడు వేసే పెరుగు పరిమాణం కూడా చూసుకోవాలి. చాలా మంది ఏడాది మొత్తం ఒకే పరిమాణం వాడుతారు. కానీ వేసవిలో ఇది సరైన విధానం కాదు. తక్కువ పెరుగుతో తోడు వేయడం వల్ల ఫర్మెంటేషన్ వేగం తగ్గుతుంది
TV9 Telugu
సాధారణంగా 500 మిల్లీలీటర్ల పాలకు అర టీ స్పూన్ పెరుగు సరిపోతుంది. పెరుగు పెట్టే ప్రదేశం కూడా రుచిపై ప్రభావం చూపుతుంది. వంటగదిలో వేడి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఉంచితే అది త్వరగా పులుస్తుంది. కాబట్టి చల్లగా ఉండే మూలలో ఉంచడం, నేరుగా సూర్యరశ్మి పడకుండా చూసుకోవడం మంచిది