మీరూ రోజూ కొబ్బ‌రిపాలు తాగుతున్నారా..?

12 February 2026

TV9 Telugu

TV9 Telugu

కొబ్బ‌రి తురిమి దాని నుండి పాల‌ను త‌యారు చేయడం మనలో చాలా మందికి తెలిసిందే. వీటిని వంటల్లో వినియోగిస్తుంటారు. కొబ్బ‌రి పాల‌ల్లో చైన్ ట్రై గ్లిజ‌రాయిడ్స్, లారిక్ యాసిడ్ స‌మృద్దిగా ఉంటాయి

TV9 Telugu

కొబ్బ‌రిపాలు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఈ పాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంద‌ని చెబుతున్నాయి. అయితే అధికంగా వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవ‌కాశం ఉందట

TV9 Telugu

కొబ్బ‌రిపాల‌ను వినియోగించే విధానం, శారీర‌క శ్ర‌మ‌, జీవ‌క్రియ‌ల‌పై వాటి వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజనాలు ఆధార‌ప‌డి ఉంటాయ‌ని వైద్యులు సూచిస్తున్నారు

TV9 Telugu

ముఖ్యంగా కొబ్బ‌రిపాలల్లో ఉండే లిపో ప్రోటీన్ మంచి కొలెస్ట్రాల్‌ను పెంచ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. ఈ పాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది

TV9 Telugu

గుండెజ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంటుంది. కొబ్బ‌రిపాల‌ను 8 వారాల పాటు తీసుకోవ‌డం వ‌ల్ల మంచి కొలెస్ట్రాల్ 18 శాతం పెరిగినట్లు అధ్యాయనాల్లో తేలింది

TV9 Telugu

కొబ్బ‌రి పాలల్లో ఉండే చైన్ ట్రైగ్లిజ‌రాయిడ్స్ కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డుతున్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇవి మంచి కొలెస్ట్రాల్ స్థాయిల‌ను పెంచిన‌ప్ప‌టికీ అధికంగా తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది

TV9 Telugu

వీటిలో క్యాల‌రీలు అధికంగా ఉంటాయి. అందువల్ల బ‌రువు పెరిగే అవ‌కాశం కూడా ఉంది. గుండె సంబంధిత స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం కూడా ఎక్కువ‌గా ఉంటుంది. కాబట్టి వీటిని త‌క్కువ మోతాదులో తీసుకోవ‌డ‌మే మంచిదన్నమాట

TV9 Telugu

రోజూ కొన్ని టేబుల్ స్పూన్ల మోతాదులో మాత్ర‌మే తాజా కొబ్బ‌రిపాల‌ను తీసుకోవాలి. ప్యాక్ చేసిన, చ‌క్కెర క‌లిపిన కొబ్బ‌రి పాల‌ను తీసుకోకూడ‌దు