ఆకుకూరల్లో తోటకూర తర్వాత ఎక్కువగా వినిపించేది పాలకూర. కొంత మంది దీనిని తినడానికి ఇష్టపడరు. కానీ దీని వల్ల బోలెడన్ని లాభాలున్నాయి. దీనిలో దాదాపు 13 రకాల యాంటీయాక్సిడెంట్లున్నాయి
TV9 Telugu
ఇవి క్యాన్సర్లు రాకుండా కాపాడతాయి. పాలకూరలో విటమిన్ కె ఎక్కువగా లభిస్తుంది. దీనిని పప్పు దినుసులతో కలిపి తేలిగ్గా వండుకోవచ్చు. అచ్చంగా అలాగే వండుకున్నా బావుంటుంది
TV9 Telugu
విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లు, సలాడ్స్, స్మూతీలు, వంటి వాటితో కలిపి తీసుకుంటే ఇందులోని ఐరన్‌ను శరీరం ఎక్కువగా శోషించుకుంటుంది
TV9 Telugu
ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పీచు, సోడియం, పొటాషియం, ఫోలిక్ ఏసిడ్, ఎ,సి,కె విటమిన్లు ఉన్నాయి. ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది