చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే గుణాలు కొబ్బరి నూనె మెండుగా ఉన్నాయి. పగిలిన లేదా అలర్జీ ఉన్న ప్రాంతంలో ఈ నూనెను మృదువుగా పూతలాగా రాస్తూ ఉండాలి. ఇది అక్కడి చర్మకణాలను ఆరోగ్యంగా మారుస్తుంది
TV9 Telugu
చర్మంపై మచ్చలను తొలగించే ఔషధగుణాలు ఇందులో ఎక్కువగా ఉన్నాయి. నోట్లోని సూక్ష్మక్రిములను సంహరించే ఔషధగుణాలు ఈ నూనెలో ఉన్నాయి
TV9 Telugu
ఉదయాన్నే బ్రష్ చేసుకున్న తర్వాత చెంచా నూనె నోట్లో వేసుకుని బాగా పుక్కిలిస్తే మంచిది. ఇది నోటిని తాజాగా ఉంచడమే కాకుండా, బ్యాక్టీరియాను తరిమి కొడుతుంది. జీర్ణాశయంలోకి వెళ్లే సూక్ష్మక్రిములను నిరోధిస్తుంది
TV9 Telugu
కొబ్బరి నూనె చర్మానికి తేమను అందించి, మృదువుగా మారుస్తుంది. వాస్తవానికి కొబ్బరి నూనె ముఖ చర్మానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఇది హానిని కూడా కలిగిస్తుంది
TV9 Telugu
ముఖ్యంగా ముఖంపై మొటిమలు ఉంటే, కొబ్బరి నూనెను రాసుకోవడం మానుకోవాలి. అటువంటి పరిస్థితిలో, కొబ్బరి నూనె రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తుంది. దీంతో మొటిమలను మరింత ప్రేరేపిస్తుంది
TV9 Telugu
అలాగే తామర అనే చర్మ వ్యాధితో బాధపడేవారు కూడా కొబ్బరి నూనెకు దూరంగా ఉండాలి. తామర వచ్చినప్పుడు చర్మంపై దురద, మంట, వాపు ఉంటుంది. ఈ సమస్యలున్నవారు కొబ్బరినూనె రాసుకుంటే సమస్య తీవ్రం అవుతుంది
TV9 Telugu
జిడ్డు చర్మతత్వం ఉన్నవారు కూడా కొబ్బరి నూనెను రాసుకోవడం మానుకోవాలి. కొబ్బరి నూనె ఎక్కువ సెబమ్‌ను ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల ఇది చర్మానికి రాస్తే చర్మం మరింత జిడ్డుగా మారుతుంది
TV9 Telugu
చర్మం మరింత సున్నితంగా ఉండేవారు, ఏదైనా చర్మ అలెర్జీ సమస్య ఉన్నా ఇలాంటి వారందరూ కొబ్బరి నూనెను రాసుకోకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు