టొమాటో రంగులో ఊరించే నారింజ శీతాకలంలో అత్యధికంగా వస్తాయి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత మృదువుగా తియ్యని తేనె రుచితో మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంటుంది
TV9 Telugu
నారింజలో పొటాషియం, క్యాల్షియం, విటమిన్లు, ప్రొటీన్లు, పీచు ఉన్నందున ఇదెంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా మెండుగా ఉన్న సి-విటమిన్ రోగనిరోధకశక్తిని పెంచి జలుబూ జ్వరాలను రానివ్వదు
TV9 Telugu
గర్భిణీ, బాలింత, నవజాత శిశువులకు అవసరమైన బి-9 విటమిన్ నారింజలో సహజ సిద్ధంగా దొరుకుతుంది. అందుకే నారింజ పండ్లను అధికంగా తినమని వైద్యులు చెబుతుంటారు
TV9 Telugu
మధుమేహ రోగులు కూడా నారింజ పండ్లు భేషుగ్గా తినొచ్చు. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. గుండెజబ్బులు, ఆర్థరైటిస్‌లను నియంత్రిస్తాయి. క్యాన్సర్, అల్జీమర్స్ లాంటి మహమ్మారులను నిరోధిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి
TV9 Telugu
అయితే శీతాకాలంలో వేడి ఆహార పదార్థాలను తినాలని, చల్లని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని వైద్యులు చెబుతుంటారు. మరైతే శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా? లేదా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది
TV9 Telugu
నారింజలో విటమిన్ సి మాత్రమే కాకుండా, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫైబర్, పొటాషియం, బి6 వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి
TV9 Telugu
చాలా మంది శీతాకాలంలో ఆరెంజ్‌కు మాత్రమే కాకుండా నిమ్మ, ఉసిరి మొదలైన పండ్లకు కూడా దూరంగా ఉంటారు. నిజానికి చలికాలంలో నారింజ, నిమ్మ, ఉసిరి వంటి పుల్లని పండ్లను తీసుకోవడం ప్రయోజనకరమని నిపుణులు చెబుతున్నారు
TV9 Telugu
ఎందుకంటే వీటిల్లో ఉండే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. నారింజ మొదలుకొని అన్ని సిట్రస్ పండ్లు జలుబు, కాలానుగుణ వ్యాధుల నుంచి రక్షించడంలో బలే ప్రయోజనకరంగా ఉంటాయి