ఓ నెల పాటు వీటిని తినడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

12 November 2024

TV9 Telugu

TV9 Telugu

పిల్లలు అడిగారనో..భర్తకు ఇష్టమని కొన్ని వంటలను చక్కగా నూనెలో వేయించి పెడుతుంటారు భార్యామణులు. కనీసం వారానికోసారయినా ఇలాంటివి తినడానికి అందరూ ఇష్టపడుతుంటారు

TV9 Telugu

ఈ ఆహారంతో వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువని వైద్యులు చెబుతున్నారు. చేతులారా మనమే మధుమేహం, అధిక రక్తపోటు, శరీరంలో కొవ్వును పెంచుకుంటాం. అధిక బరువుతో సతమతమవుతామని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు

TV9 Telugu

ఈ అలవాటు మీ శరీరంలో లివేటెడ్ కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్ ప్రమాదం ఇతర ఇతర ప్రతికూల పరిణామాలు కలిగిస్తుంది. అయితే నెల రోజులపాటు హఠాత్తుగా వేయించిన ఆహారాన్ని తినడం మానేస్తే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా

TV9 Telugu

దాదాపు అన్ని శుద్ధి చేసిన నూనెలలో ట్రాన్స్ ఫ్యాట్, సంతృప్త కొవ్వు అధికంగా ఉంటాయి. ఈ నూనెలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల గుండె సమస్యలు పెరుగుతాయి

TV9 Telugu

అయితే నెల రోజులు నూనెలో వేయించిన ఆహారాలు తినకపోతే కొలెస్ట్రాల్ తో పాటు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఎక్కువ నూనెలో వేయించిన ఆహారాల్లో ఎక్కువ కేలరీలు ఉంటాయి. వీటిని మానేస్తే బరువు నియంత్రణలో సహాయపడుతుంది

TV9 Telugu

కడుపులోని కాలేయం పనితీరు మరింత ప్రభావవంతంగా మారుతుంది. ఇది మన చర్మంపై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే స్కిన్ టోన్ మెయింటెయిన్ కావాలంటే వేపుడు పదార్థాల వినియోగాన్ని తగ్గించుకోవడం చాలా అవసరం

TV9 Telugu

ఏడాది పొడవునా గుండెల్లో మంటతో బాధపడేవారు వేయించిన ఆహారాన్ని అస్సలు తినకూడదు. జీర్ణశక్తికి రోజూ మందులు వేసుకోవడం అంత మంచిది కాదు. అయితే వేపుడు పదార్థాలను తీసుకోవడం తగ్గించుకుంటే ఆ సమస్య నుంచి తేలికగా బయటపడవచ్చు

TV9 Telugu

స్వీట్లు తినకపోయినా శరీరంలో చక్కెర శాతం తగ్గాలంటే వేయించిన ఆహారానికి దూరంగా ఉండాలి. శుద్ధి చేసిన నూనె వినియోగాన్ని ఆపడం వల్ల ఆకస్మిక మార్పు ఉండదు. కానీ క్రమంగా రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణ స్థాయికి చేరుకుంటుంది