Almond 1

బాదం తింటే నిజంగానే జ్ఞాపకశక్తి పెరుగుతుందా?

11 November 2024

image

TV9 Telugu

నేటి జీవనశైలి కారణంగా అనేక మంది మతిమరుపుతో బాధపడుతున్నారు. అయితే మెదడు చురుకుగా ఉండాలంటే బాదం తినాలని చాలా మంది చెబుతుంటారు. దీంట్లో నిజమెంతో తెలుసా?

TV9 Telugu

నేటి జీవనశైలి కారణంగా అనేక మంది మతిమరుపుతో బాధపడుతున్నారు. అయితే మెదడు చురుకుగా ఉండాలంటే బాదం తినాలని చాలా మంది చెబుతుంటారు. దీంట్లో నిజమెంతో తెలుసా?

బాదం పప్పు జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు సైతం చెబుతున్నారు. రాత్రంతా నానబెట్టిన బాదం పప్పుల్ని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది

TV9 Telugu

బాదం పప్పు జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు సైతం చెబుతున్నారు. రాత్రంతా నానబెట్టిన బాదం పప్పుల్ని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది

బాదం నానబెట్టడం వల్ల లైపేజ్ అనే ఎంజైమ్ ఉత్పత్తవుతుంది. ఇది మన ఆహారం ద్వారా తీసుకున్న కొవ్వులు కరిగేందుకు దోహదపడుతుంది. బాదంపప్పులో కాల్షియం, మెగ్నీషియం, ప్రొటీన్, మాంగనీస్, ఫైబర్, పొటాషియం, విటమిన్ బి6, బి2, విటమిన్ ఇ అధికంగా ఉంటాయి

 బాదంపప్పులో ఉండే బాదంపప్పులో విటమిన్ ఇ స్వల్పకాల జ్ఞాపకశక్తిని మెరుగుపరచడమే కాకుండా, అల్జీమర్స్ వంటి తీవ్రమైన సమస్యలను నివారించడంలో కూడా సహాయపడుతుంది

TV9 Telugu

విటమిన్ ఇ కాకుండా, బాదంలో జింక్, ప్రోటీన్లు సైతం ఉంటాయి. ఇవి మెదడు కణాల అభివృద్ధికి సహాయపడతాయి. దీని వినియోగం ఎసిటైల్కోలిన్ స్థాయిని పెంచుతుంది. ఇది సరైన మెమరీ పనితీరుకు అవసరం

TV9 Telugu

బాదంపప్పులో మోనోశాచురేటెడ్ కొవ్వు ఉంటుంది. దీనిని మంచి కొవ్వు అని కూడా అంటారు. ఇది మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఇది గుండెను ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది

TV9 Telugu

బాదంపప్పును రోజూ తీసుకోవడం వల్ల చర్మం మెరుస్తుంది. ఇందులో చర్మానికి అవసరమైన విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. అందుకే ప్రతిరోజూ బాదంపప్పు తీసుకోవడం వల్ల చర్మం మెరుస్తుంది

TV9 Telugu

బాదంపప్పు తినడం వల్ల బరువు తగ్గడం, కండరాల పెరుగుదల, రక్తంలో చక్కెర నియంత్రణ, ఎముకలను బలోపేతం చేయడం, కళ్లు ఆరోగ్యంగా ఉండడం వంటి అనేక ప్రయోజనాలు లభిస్తాయి