వయసుని వెనక్కి పరుగులు పెట్టించే ఆహారాల్లో అవకాడో మొదటి వరుసలో ఉంటుంది. దీన్ని బటర్ ఫ్రూట్ అని కూడా అంటారు. దీని ప్రయోజనం జీవితకాలాన్ని పెంచడం మాత్రమే అనుకుంటే పొరపాటే
TV9 Telugu
ఆరోగ్యవంతమైన చర్మం, నిగనిగలాడే జుట్టు వంటివి కూడా తోడయ్యేలా చేసి పెరుగుతున్న వయసు ఛాయలని తొలగించి యౌవ్వనంగా కనిపించేటట్టు చేస్తుంది
TV9 Telugu
నిజానికి, అందం బయట నుంచి రాదు. లోపల నుంచి ప్రారంభమవుతుంది. జీర్ణశక్తి చక్కగా ఉంటే తక్కిన వ్యవస్థలన్నీ సవ్యంగా పనిచేసి ఆ అందమంతా ముఖంలో ప్రతిఫలిస్తుంది. అలా చేయడంలో అవకాడో తరవాతే ఏదైనా..
TV9 Telugu
అవకాడోలో ఇంకా చాలా గుణాలు ఉన్నాయి. అందుకే దీనిని సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తారు. దానిలోని పోషకాల కారణంగా ఇది బాగా ప్రాచుర్యం పొందింది. అందరూ దీనిని తినేందుకు ఆసక్తి చూపుతున్నారు
TV9 Telugu
అవోకాడోను బటర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ పండు పండినప్పుడు, దాని ఆకృతి క్రీమీగా మారుతుంది. అసలు దీనికి బటర్ ఫ్రూట్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే
TV9 Telugu
అవకాడోను అనేక రకాలుగా తింటారు. సలాడ్లు, స్మూతీస్ కాకుండా.. దీనిని అనేక రకాల ఇతర ఆహారాలలో కూడా జోడిస్తారు. ఇందులో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది
TV9 Telugu
అవకాడోలో విటమిన్ కె, ఇ, సి ఎక్కువగా లభిస్తాయి. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. అవకాడో బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ప్రోటీన్ అధిక మొత్తంలో ఉంటుంది
TV9 Telugu
అవకాడోలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే మార్కెట్‌లో వీటికి డిమాండ్ అధికంగా ఉంటుంది. దీని డిమాండ్ కారణంగా తమిళనాడు, కర్ణాటక, కేరళలలో అధికంగా పండిస్తున్నారు