జ్వరం వచ్చినప్పుడు కాఫీ తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
10 September 2025
TV9 Telugu
TV9 Telugu
వేడి వేడి కాఫీ గొంతులోకి అలా దిగుతుంటే ఆ మజానే వేరు. వెంటనే ఎక్కడలేని హుషారు వచ్చేస్తుంది. అప్పటిదాకా ఉన్న నిస్సత్తువ మటుమాయం అయిపోతుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఇదంతా కాఫీలోని కెఫీన్ మహాత్మ్యమే..
TV9 Telugu
ఇది కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. ఫలితంగా చురుకుదనం, హుషారు వస్తుంది. అయితే దీంతో కొన్ని ఇబ్బందులు లేకపోలేదు
TV9 Telugu
ముఖ్యంగా వాతావరణ మార్పుల కారణంగా జ్వరం, జలుబు, దగ్గు వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు సర్వసాధారణం. ఇలా జ్వరం వచ్చినప్పుడు నోటికి రుచి ఉండదు
TV9 Telugu
అందుకే ఈ సమయంలో చాలా మంది కాఫీ, టీ తాగడానికి ఇష్టపడతారు. కాఫీ లేదా టీ తాగడం వల్ల మనసు కాస్త రిలాక్స్ అవుతుందనేది నిజమే. కానీ ఈ సమయంలో కాఫీ తాగకుండా ఉండటమే మంచిదని నిపుణులు అంటున్నారు
TV9 Telugu
జ్వరం వచ్చినప్పుడు శరీరం సహజంగానే అలసిపోతుంది. ఈ సమయంలో శరీరానికి విశ్రాంతి అవసరం. జ్వరం వచ్చినప్పుడు కాఫీ తాగితే, అందులోని అధిక కెఫిన్ కంటెంట్ మీ శరీరాన్ని విశ్రాంతి తీసుకోవడంలో అడ్డుకుంటుంది
TV9 Telugu
కాఫీలో ఉండే కెఫిన్ కంటెంట్ అందుకు కారణం. ఇది నిద్ర పట్టకుండా నిరోధిస్తుంది. ఇది శరీరంలో డీహైడ్రేషన్ కు కూడా కారణమవుతుంది. కానీ ఆరోగ్యం క్షీణించినప్పుడు హైడ్రేషన్ ను నిర్వహించడం చాలా ముఖ్యం
TV9 Telugu
కాఫీతో మూత్రం ఎక్కువగా వస్తుంది. దీంతో ఉప్పు, నీరు ఎక్కువగా బయటకు వెళ్లిపోయి ఒంట్లో నీటిశాతం తగ్గే (డీహైడ్రేషన్) ప్రమాదముంది. అందుకే జ్వరం సమయంలో కాఫీ తాగడం మంచిది కాదు
TV9 Telugu
జ్వరం వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకోవడం, నిద్రను ప్రోత్సహించే పోషకమైన ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం. సులభంగా జీర్ణమయ్యే ఆహారాలతోపాటు గోరువెచ్చని నీళ్లు తాగడం మంచిది