Banana 5

బాప్‌రే.. ఉదయం పూట ఖాళీ కడుపుతో అరటిపండు తింటే ఇన్ని లాభాలా?

07 February 2025

image

TV9 Telugu

TV9 Telugu

ఏడాది పొడవునా దొరికేది, అందరికీ అందుబాటులో ఉండేది, ఎంతగానో మేలు చేసేది ఏదంటే- అది కచ్చితంగా అరటిపండే. ఈ పండు తినడం వల్ల ఎన్నెన్ని ప్రయోజనాలున్నాయి

TV9 Telugu

పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్‌, రిబోఫ్లేవిన్‌, ఫొలేట్‌, కాపర్‌, పీచు, బి6, సి-విటమిన్లలు కలిగిన అరటి మంచి పోషకాహారం. తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది

TV9 Telugu

గుండె జబ్బులను రానివ్వదు. మనసుకు ఆహ్లాదం కలిగిస్తుంది, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్‌ నొప్పి, వాపులను తగ్గించి.. మొత్తంగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. హార్మోన్లను క్రమబద్ధం చేస్తుంది

TV9 Telugu

అందుకే అరటిపండు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. దీన్ని తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది

TV9 Telugu

అయితే ఖాళీ కడుపుతో ప్రతిరోజూ రెండు అరటిపండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు పోషకాహార నిపుణులు. అరటిపండులో ఫైబర్ ఉంటుంది

TV9 Telugu

ఇది మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వ్యాయామం చేసే ముందు లేదా ఉదయం అల్పాహారంలో అరటిపండు తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది

TV9 Telugu

మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది. అరటిపండులో పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులోని ఫైబర్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది

TV9 Telugu

ఒత్తిడి ఆందోళన వల్ల ఏర్పడే చర్మ సమస్యలకు అరటి చక్కని పరిష్కారం అందిస్తుంది. ఇందులో ట్రిప్టోఫాన్ అనే మూలకం ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. అరటి పండు తినడం వల్ల మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది