పులావ్, బిర్యానీ, ఉప్మా, చాట్.. ఇలా ఏ వంటకానికైనా అదనపు రుచినీ, కంటికింపైన రంగునీ ఇస్తుంది పచ్చిబఠాణీ. అంతేనా.. ఇందులో పోషకాల మోతాదూ ఎక్కువే
TV9 Telugu
శీతాకాలంలో పుష్కలంగా లభించే పచ్చి బఠాణీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే వీటిని ఉడికించి తినడం కంటే నేరుగా పచ్చిగానే తినడం మరింత మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు
TV9 Telugu
పచ్చి బఠాణీలో ఐరన్ సమృద్ధిగా దొరుకుతాయి. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది. ఇందులోని ల్యూటిన్ అనే కెరొటినాయిడ్ కళ్లలో శుక్లాలు రానివ్వదు. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది
TV9 Telugu
పచ్చి బఠాణీ గింజలను తినడం వల్ల ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా గొప్ప ప్రయోజనం పొందుతుంది. ఇందులోని విటమిన్ బి6, సి, ఫోలేట్ వంటి పోషకాలు చర్మ సంరక్షణకి అవసరమైన కొలాజెన్, ఎలాస్టిన్‌ని అందిస్తాయి
TV9 Telugu
ఈ విషయం చాలా మందికి తెలియకపోయినా పచ్చి బఠాణీలను పచ్చిగానే తినేస్తుంటారు. ఇలా తినడం వల్ల బీన్స్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి
TV9 Telugu
పచ్చి బఠాణీ ఒంట్లో కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ సహాయపడతాయి. తద్వారా గుండె జబ్బులను నివారించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కడుపు క్యాన్సర్ రాకుండా నివారించడంలో బఠాణీ చేసే మేలు అంతాఇంతా కాదు
TV9 Telugu
అందుకే రోజూ పచ్చి బఠాణీ తింటే కడుపులో క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు సైతం చెబుతున్నారు. అంతేకాకుండా వీటిల్లో ఉండే ఫోలిక్ యాసిడ్ కడుపు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది
TV9 Telugu
వీటిల్లో కొవ్వు శాతం తక్కువగా, ప్రొటీన్, పీచు ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి సరైన ఆహారం ఇది. కొలెస్ట్రాల్‌నీ తగ్గిస్తుంది. మాంసాహారం తినని వారు ప్రొటీన్ కోసం పచ్చి బఠాణీలను ఎంచుకోవచ్చు