తళతళ తమలపాకుతో పసందైన ఆరోగ్యం.. అతిచేస్తే క్యాన్సర్ పక్కా!

17 March 2025

TV9 Telugu

TV9 Telugu

పెళ్లి, పేరంటం లాంటి సందర్భాలూ సంప్రదాయాల్లో తమలపాకులు ఉండితీరాల్సిందే! విందు భోజనం తర్వాత తాంబూలం సేవించామంటే స్వర్గసౌఖ్యం అనుభూతికొచ్చినట్టే ఉంటుంది

TV9 Telugu

తమలపాకులో ఆరోగ్యాన్ని సంరక్షించే సుగుణా కూడా ఎన్నో ఉన్నాయి. తమలపాకులో కాల్షియం, పొటాషియం, ఐరన్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, అనేక యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి

TV9 Telugu

తమలపాకులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో అనేక విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. తమలపాకులో విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటుంది

TV9 Telugu

ఈ విటమిన్ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇది వ్యాధులను నివారిస్తుంది. తమలపాకులో విటమిన్ ఎ ఉంటుంది. ఈ విటమిన్ కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది  చర్మాన్ని కూడా ఆరోగ్యంగా చేస్తుంది

TV9 Telugu

తమలపాకులో విటమిన్లు B1, B2, B3 ఉంటాయి. ఈ విటమిన్లు గుండె, నాడీ వ్యవస్థ జీర్ణవ్యవస్థకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది చర్మం, జుట్టును ఆరోగ్యంగా చేస్తుంది

TV9 Telugu

కీళ్ల నొప్పులకు తమలపాకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీని శోథ నిరోధక లక్షణాలు కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, వాపులను తగ్గించడంలో సహాయపడతాయి.  నోటిలోని బ్యాక్టీరియాను చంపి దుర్వాసనను తొలగిస్తాయి

TV9 Telugu

బకెట్‌ నీళ్లలో ఒక తమలపాకును తుంపి వేసి అరగంట తర్వాత స్నానం చేస్తే దేహానికి మరింత స్వచ్ఛత చేకూరుతుంది. రోజంతా చెమట వాసన రాదు. సాయంత్రం వేళ ఈ ఆకుతో మరిగించిన నీళ్లను చల్లార్చి ముఖం కడుక్కుంటే ఎంతో తేటగా ఉంటుంది

TV9 Telugu

ఇంత మేలు చేసే తమలపాకు మోతాదు మించితే మాత్రం క్యాన్సర్‌ లాంటి మహమ్మారితో సహా అనేక అనారోగ్యాలకు కారణమవతుంది. అందుకే అతి అస్సలు తగదు..