వంటింటి పెద్దక్క.. ఉల్లిని వేసవిలో తినొచ్చా?

18 March 2025

TV9 Telugu

TV9 Telugu

కూర, చారుల్లో ఉల్లిపాయ తప్పనిసరి. వంకాయ, గోంగూర లాంటి రోటిపచ్చళ్ల రుచి పెంచేస్తుంది. సాయంత్రం స్నాక్స్‌లో ఉల్లి పకోడీ రారాణి

TV9 Telugu

వంటింట్లో పెద్దక్కయ్య పాత్ర పోషించే ఉల్లిపాయ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. అయితే వాతావరణం వేడెక్కుతున్న కొద్దీ, కొన్నిసార్లు ఆహారం మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది

TV9 Telugu

వేసవిలో చల్లదనాన్నిచ్చే ఆహారాలను ఆహారంలో చేర్చుకోవాలి. అలాంటి వాటిల్లో ఉల్లి ముందు వరుసలో ఉంటుంది. దాదాపు ప్రతి ఇంట్లో కూరల గ్రేవీ తయారీకి ఉల్లి ఉపయోగిస్తారు 

TV9 Telugu

దీనితో పాటు పచ్చి ఉల్లిని సలాడ్‌గా కూడా ఎక్కువగా తీసుకుంటారు. ఉల్లిపాయ ఒంటికి చల్లదనాన్ని కలిగిస్తుంది. కాబట్టి వేసవిలో ప్రతిరోజూ ఆహారంలో పచ్చి ఉల్లిపాయను చేర్చుకుంటే, శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి

TV9 Telugu

వేసవిలో పచ్చి ఉల్లి తినడం జీర్ణక్రియకు చాలా మంచిది. ఇది గ్యాస్‌ను కలిగించదు. ఆమ్లతను కూడా కలిగించదు. చక్కగా జీర్ణం అవుతుంది

TV9 Telugu

ఉల్లిపాయలో నీరు కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి పచ్చి ఉల్లి వినియోగం వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుకోవడంలో కూడా సహాయపడుతుంది

TV9 Telugu

వేసవిలో, వేడిగాలులు ప్రారంభమైనప్పుడు వాంతులు, వికారం, విరేచనాలు వంటి సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతుంటాయి. వడదెబ్బను నివారించడానికి పచ్చి ఉల్లిపాయను తినడం  ప్రయోజనకరంగా ఉంటుంది

TV9 Telugu

ఉల్లి జుట్టుకు కూడా మేలు చేస్తుంది. ఇది ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తుంది. ఇది నొప్పి, వాపును నివారిస్తుంది. కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. రక్తంలో చక్కెరను నిర్వహించడంలో కూడా సహాయపడతాయి