అయితే గుడ్లు ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికీ వీటిని తీసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరమని నిపుణులు చెబుతున్నారు
TV9 Telugu
గుడ్డును తీసుకునేటప్పుడు కొందరు పచ్చసొనను వదిలేసి తెల్లసొనను మాత్రమే తింటారు. కానీ గుడ్డును మొత్తంగా తీసుకుంటేనే శరీరానికి పోషకాలు చక్కగా అందుతాయి
TV9 Telugu
గుడ్డు పచ్చసొనలో విటమిన్ డి, కోలిన్ వంటి ముఖ్య పోషకాలు ఉంటాయి. గుడ్డును పచ్చసొనతో సహా తీసుకోవాలి. అయితే ఎల్లప్పుడూ మితంగానే తీసుకోవాలనే విషయం మర్చిపోకూడదు
TV9 Telugu
అలాగే గుడ్డును ఉడికించి తీసుకోవడం మంచిది. గుడ్డును ఉడికించడం వల్ల దానిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అనారోగ్యకరమైన కొవ్వులు ఉండవు
TV9 Telugu
నూనెలో వేయించడం వల్ల అదనంగా క్యాలరీలు పెరుగుతాయి. ఇవి గుండె ఆరోగ్యానికి అంత మంచివి కావు. అలాగే గుడ్లను అధిక ఫైబర్ కలిగిన ఆహారాలతో కలిపి తీసుకోవడం మంచిది. అలాగే గుడ్లను పచ్చిగా తినడం మంచిది కాదు
TV9 Telugu
దీని వల్ల సాల్మొనెల్లా బ్యాక్టీరియా లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే గుడ్డును పూర్తిగా ఉడికించి తీసుకోవడం మంచిది. అధిక కొలెస్ట్రాల్ ఉన్న వారు గుడ్డును వారానికి 3 నుంచి 4 సార్లు మాత్రమే తీసుకోవాలి. ఆరోగ్య వంతులు రోజుకొక్కటి తినొచ్చు