చూస్తేనే నోరూరుతుంది కదూ.. తింటే లాభాలూ ఉన్నాయ్

17 April 2026

TV9 Telugu

TV9 Telugu

లీచీ వేసవి పండు. చూడటానికి జెల్లీలా ఉంటుంది. కానీ రుచి మాత్రం భలేగా ఉంటుంది. లిచీలో ‘సి’, ‘డి’.. వంటి విటమిన్లతో పాటు మెగ్నీషియం, రైబోఫ్లేవిన్‌, కాపర్‌, ఫాస్ఫరస్‌.. వంటి పోషకాలు అధికంగా ఉండే లిచీ పండును రోజూ తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా పలు ప్రయోజనాలు చేకూరుతాయి

TV9 Telugu

వేసవి కాలంలో విరివిగా లభించే ఈ పండ్లలో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు బరువునూ అదుపులో ఉంచుతాయి. అందాన్నీ ద్విగుణీకృతం చేస్తాయి. పైగా వీటిలో నీటి శాతం కూడా ఎక్కువే

TV9 Telugu

హైపర్‌టెన్షన్‌ సమస్యకు లిచి మంచి విరుగుడు అంటున్నారు నిపుణులు. ఇందుకు దీనిలో ఉండే పొటాషియమే కారణం. ఇది బీపీని అదుపు చేయడంలో సహకరిస్తుంది. వేసవిలో చాలామంది కడుపుబ్బరం సమస్యతో బాధపడుతుంటారు. దీనికి చెక్‌ పెట్టాలంటే ఫైబర్‌ అధికంగా ఉండే లిచీ పండును తీసుకోవాల్సిందే

TV9 Telugu

ఇది జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి.. కడుపుబ్బరంతో పాటు పలు జీర్ణ సంబంధిత సమస్యల్ని తగ్గిస్తుంది. లిచీలో ఫైబర్‌, నీటి శాతం ఎక్కువ.. కొవ్వులు, క్యాలరీలు తక్కువ. ఈ సుగుణాలే బరువును అదుపులో ఉంచేందుకు దోహదం చేస్తాయి. తద్వారా ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండచ్చు

TV9 Telugu

లిచీలో ఉండే విటమిన్‌ ‘సి’ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహకరిస్తుంది. తద్వారా వివిధ రకాల అనారోగ్యాలు, ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండచ్చు

TV9 Telugu

లిచీ పండులో ఉండే ఫ్లేవనాయిడ్స్‌లో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఇవి ఫ్లూ, ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి

TV9 Telugu

ఇతర పండ్లతో పోల్చితే లిచీలో పాలీఫినోల్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, క్యాన్సర్‌-మధుమేహ ముప్పును తప్పించడంలో సహకరిస్తాయి

TV9 Telugu

ఈ పండులో ఉండే మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, ఐరన్‌, కాపర్‌, మాంగనీస్‌.. వంటి ఖనిజాలు.. మనం తీసుకున్న ఆహారం నుంచి క్యాల్షియంను శరీరం సులభంగా గ్రహించేందుకు తోడ్పడతాయి. ఫలితంగా ఎముకలు దృఢమవుతాయి