తిరుమలలో 12 నెలలలోపు శిశువులతో వచ్చే తల్లిదండ్రుల కోసం టీటీడీ శిశు దర్శనం అనే ప్రత్యేక సౌకర్యాన్ని అందిస్తోంది. ఉచితంగా, త్వరితగతిన లభించే ఈ దర్శనానికి ముందస్తు రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6 గంటల వరకు సుపథం ప్రవేశ ద్వారం వద్ద పసిబిడ్డతో పాటు తల్లిదండ్రులు డాక్యుమెంట్లను సమర్పించి సులభంగా దర్శనం చేసుకోవచ్చు.