ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని శివసాయి నగర్లో బిందు అనే భక్తురాలి ఇంట్లో తొలి ఏకాదశి పర్వదినాన అరుదైన బ్రహ్మ కమలం పుష్పాలు వికసించాయి. హిమాలయ ప్రాంతాల్లో ఏడాదికి ఒక్కసారి రాత్రివేళ పూసే ఈ పువ్వులు ఒకేసారి మూడు పూయడం విశేషం. దీనిని పూర్వికులు ఎంతో అదృష్టంగా భావిస్తారు.