మీ వెండి నగలు నల్లగా మారాయా? బంగాళాదుంపతో ఇలా చేయండి
27 July 2026
TV9 Telugu
TV9 Telugu
బంగాళాదుంపతో చేసే కూరలన్నా, వంటకాలన్నా మనకు చాలా ఇష్టం. పలు చర్మ సమస్యల్ని తగ్గించి మేని ఛాయను పెంచే సుగుణాలూ ఇందులో బోలెడున్నాయి
TV9 Telugu
అయితే ఇలా అందాన్ని, ఆరోగ్యాన్ని అందించే ఈ దుంప.. పాత్రలపై పేరుకున్న తుప్పును కూడా వదిలిస్తుందని మీకు తెలుసా?
TV9 Telugu
సహజసిద్ధమైన క్లీనింగ్ ఏజెంట్‌గా పనిచేసే ఈ దుంపలు పలు ఇంటి అవసరాలకూ ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు
TV9 Telugu
ఐరన్, స్టీలు పాత్రలు తుప్పు పడితే ఆలూను మందపాటి స్లైసుల్లా కట్ చేసుకోవాలి. ఈ స్లైస్‌ను గిన్నెలు తోమే సోప్ లిక్విడ్‌లో ముంచాలి
TV9 Telugu
లేదంటే బేకింగ్ సోడాలో అద్ది.. తుప్పు ఉన్న చోట నెమ్మదిగా రుద్దాలి. ఫలితంగా తుప్పు వదిలిపోయే అవకాశం ఉంటుందట
TV9 Telugu
ఆ తర్వాత డిష్‌వాషింగ్ లిక్విడ్‌తో శుభ్రం చేసి పొడిగా తుడిచి ఆరబెడితే సరిపోతుంది. అడుగంటుకున్న వంట గిన్నెలను కూడా నిమ్మరసంతో కలిపి శుభ్రం చేయవచ్చు
TV9 Telugu
తుప్పు పట్టిన వంటింటి కత్తులపై బంగాళాదుంప ముక్కతో రుద్ది ఓ ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత సాధారణ నీటితో కడిగస్తే సరి
TV9 Telugu
వెండి ఆభరణాలు నల్లగా మారితే బంగాళాదుంపలు మరిగించిన నీళ్లతో (గోరు వెచ్చగా) వెండి వస్తువుల్ని గంటపాటు వదిలేసి ఆ తర్వాత బ్రష్‌తో శుభ్రం చేస్తే మెరిసిపోతాయ్