AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డిగ్రీ పూర్తి చేశారా? ISROలో ఉద్యోగం పొందే అవకాశం.. హైదరాబాద్, శ్రీహరికోటలోనూ కొలువులు

ఇస్ట్రో పరిధిలోని వివిధ కేంద్రాలు, స్వయంప్రతిపత్తి సంస్థల్లో ఖాళీగా ఉన్న పే మ్యాట్రిక్స్ లెవల్-4 పోస్టుల భర్తీకి ఇస్రో షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో జులై 27, 2026వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామక ప్రక్రియ ద్వారా..

డిగ్రీ పూర్తి చేశారా? ISROలో ఉద్యోగం పొందే అవకాశం.. హైదరాబాద్, శ్రీహరికోటలోనూ కొలువులు
ISRO recruitment
Srilakshmi C
|

Updated on: Jul 27, 2026 | 6:30 PM

Share

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ పరిధిలోని వివిధ కేంద్రాలు, స్వయంప్రతిపత్తి సంస్థల్లో ఖాళీగా ఉన్న పే మ్యాట్రిక్స్ లెవల్-4 పోస్టుల భర్తీకి ఇస్రో షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో జులై 27, 2026వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 244 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో హైదరాబాద్‌లోని కేంద్రాల్లో 15 ఖాళీలు, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట కేంద్రంలో 49 ఖాళీలు ఉన్నాయి. ఇస్రో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం పోస్టుల వారీగా ఖాళీలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

విభాగాల వారీగా ఖాళీల వివరాలు..

  • అసిస్టెంట్‌ పోస్టుల సంఖ్య: 130
  • జూనియర్ పర్సనల్ అసిస్టెంట్‌ పోస్టుల సంఖ్య: 81
  • అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC) పోస్టుల సంఖ్య: 22
  • స్టెనోగ్రాఫర్‌ పోస్టుల సంఖ్య: 10
  • జూనియర్ పర్సనల్ అసిస్టెంట్‌ పోస్టుల సంఖ్య: 1

ఇస్రోలో సిస్టెంట్, క్లర్క్, స్టెనోగ్రాఫర్ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా విభాగంలో డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులతో సాధించి ఉత్తీర్ణత ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ పోస్టులకు డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ కమర్షియల్/సెక్రటేరియల్ ప్రాక్టీస్ పూర్తి చేసి ఉండాలి. స్టెనో-టైపిస్ట్ లేదా స్టెనోగ్రాఫర్‌గా కనీసం ఏడాది అనుభవం ఉండాలి. ఇంగ్లిష్ స్టెనోగ్రఫీ, కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. అభ్యర్ధుల వయోపరిమితి ఆగస్టు 16, 2026 నాటికి 28 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్ వర్గాల వారికి వయో సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు 31 ఏళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 33 ఏళ్లు వరకు వయోసడలింపు ఉంటుంది.

ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఆగస్ట్ 16, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్‌ అభ్యర్థులు రూ.500 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ వేతనం నెలకు రూ.25,500తో పాటు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు అందిస్తారు. అంతరిక్ష రంగంలో కెరీర్‌ నిర్మించుకోవాలనుకునే అభ్యర్థులకు ఈ నియామకం మంచి అవకాశం. అర్హతలు ఉన్న అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని ఇస్రో సూచించింది.

ఇస్రోలో సిస్టెంట్, క్లర్క్, స్టెనోగ్రాఫర్ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us