AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోకాళ్ళ నొప్పులకు చెక్ పెట్టె పచ్చిమిర్చి నువ్వుల అన్నం.. ఇలా చేస్తే మళ్ళీ మళ్ళీ అడుగుతారు

సమయం తక్కువగా ఉన్నప్పుడు కానీ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ రెసిపీని ఈజీగా చేసుకోవచ్చు. అయితే, ఈ పచ్చిమిర్చి నువ్వుల అన్నాన్ని మీరు కేవలం ఐదు నిమిషాల్లో తయారుచేసుకోవచ్చు. ఈ వంటకం చాలా రుచిగా ఉండటమే కాకుండా, ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా తయారు చేస్తారు. ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళకి, బ్యాచిలర్లకు ఇది చాలా ఉపయోగపడుతుంది. దీనిని తింటే, మోకాళ్ళ నొప్పులకు చెక్ పెట్టొచ్చు.

Prasanna Yadla
|

Updated on: Nov 25, 2026 | 8:57 AM

Share

1 / 5
ముందుగా పాన్ మీద పెట్టుకుని, నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వులను లో ఫ్లేమ్‌లో దోరగా వేయించాలి. నువ్వులు మాడిపోకుండా జాగ్రత్త చూడాలి. నువ్వులు చక్కగా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇదే పాన్ లో  ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి, 30 గ్రాముల పచ్చిమిర్చిని దోరగా వేయించాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, చల్లార్చుకోవాలి.

2 / 5

మిక్సీ జార్‌లోని నువ్వులను ముందుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వేయించిన పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, అర టేబుల్ స్పూన్ ఉప్పు కలిపి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు పోపు కోసం మరొకసారి స్టవ్ మీద పాన్ పెట్టి, రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి కొద్దిగా వేడి అయిన తర్వాత 30 గ్రాముల పల్లీలు, ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, అర టేబుల్ స్పూన్ ఆవాలు వేసి దోరగా వేయించాలి. ఫ్లేవర్డ్ రైస్ చేసేటప్పుడు నెయ్యి వాడటం వల్ల రుచి పెరుగుతుంది.

3 / 5

పల్లీలు, పప్పు దినుసులు చక్కగా వేగిన తర్వాత, నాలుగు ఎండుమిర్చి ముక్కలు, ఒక చిటికెడు ఇంగువ, రెండు రెబ్బల కరివేపాకు వేసి వేయించాలి.  తర్వాత, మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, నువ్వుల పేస్ట్‌ను పోపులో వేసి, పావు టీ స్పూన్ పసుపు కలపాలి. స్టవ్‌ను సిమ్ లోనే ఉంచి, రెండు నిమిషాల పాటు వేగించాలి.

4 / 5
రెండు నిమిషాలు వేగిన తర్వాత, ముందుగానే ఉడికించి చల్లార్చుకున్న 200 గ్రాముల అన్నాన్ని (బాస్మతి లేదా మిగిలిన అన్నం కూడా వాడవచ్చు) పాన్ లో వేసి బాగా కలుపుకోవాలి. అన్నం బాగా కలిసిన తర్వాత, ఒక చెక్క నిమ్మరసం పిండుకుని, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి మరోసారి కలపాలి. నిమ్మరసం ఉప్పు, కారం బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది. అంతే, పచ్చిమిర్చి నువ్వుల అన్నం రెడీ . 
 ఇది చాలా రుచికరంగా ఉంటుంది.

రెండు నిమిషాలు వేగిన తర్వాత, ముందుగానే ఉడికించి చల్లార్చుకున్న 200 గ్రాముల అన్నాన్ని (బాస్మతి లేదా మిగిలిన అన్నం కూడా వాడవచ్చు) పాన్ లో వేసి బాగా కలుపుకోవాలి. అన్నం బాగా కలిసిన తర్వాత, ఒక చెక్క నిమ్మరసం పిండుకుని, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి మరోసారి కలపాలి. నిమ్మరసం ఉప్పు, కారం బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది. అంతే, పచ్చిమిర్చి నువ్వుల అన్నం రెడీ . ఇది చాలా రుచికరంగా ఉంటుంది.

5 / 5
Follow Us
మోకాళ్ళ నొప్పులకు చెక్ పెట్టె పచ్చిమిర్చి నువ్వుల అన్నం

రేపే అకౌంట్లోకి రూ.2 వేలు.. తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

సింపుల్‌గా కనిపించే రైనా ఇంట్లో ఇన్ని ప్రత్యేకతలా?

మళ్లీ నిద్రలేచిన డొనాల్డ్‌ ట్రంప్‌ టారిఫ్‌ పైత్యం..!

ఏపీలో రేపే తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ర్యాలీలకు నో పర్మిషన్..

ఊయల ఊగడం అంటే పిల్లల ఆట కాదు.. పెద్దలకు ఊహించని ఆరోగ్య లాభాలు

ఏపీలో విషాదం.. కార్తీక దీపాల కోసం వెళ్లి కానరాని లోకాలకు..

ఓటీటీలోకి వచ్చేస్తున్న సూర్య హ్యాట్రిక్ హిట్ మూవీ..

రూ.18 లక్షల ముంపు పరిహారం డబ్బులపై కన్ను.. భర్త దారుణ హత్య!

కళ్లముందే మంటల్లో బాలుడు సజీవ దహనం.. కాపాడుకోలేక తల్లి ఆర్తనాదాలు