AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : థియేటర్లలో సెన్సేషన్.. ఓటీటీలో దుమ్మురేపిన సినిమా.. టీవీల్లోకి వస్తున్న బ్లాక్ బస్టర్..

బాక్సాఫీస్ వద్ద రూ.75 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించిన చిత్రం ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అర్జున్ సర్జా, ప్రీతి ముకుందన్ కీలక పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్, ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం కానుంది.

Rajitha Chanti
|

Updated on: Nov 24, 2026 | 7:50 PM

Share
 2026లో బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయాన్ని అందుకున్న చిత్రాలలో ‘బ్లాస్ట్’ ఒకటి. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా థియేటర్లలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని కలెక్షన్ల వర్షం కురిపించింది. తమిళంలో తెరకెక్కి తెలుగులోనూ డబ్ అయిన ఈ సినిమా, ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ వివరాలను అధికారికంగా ప్రకటించారు.

1 / 5
‘బ్లాస్ట్’ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన నవంబర్ 24న వెలువడింది. ఈ ఆదివారం (నవంబర్ 29) సాయంత్రం 6 గంటలకు స్టార్ మా (నెల్‌లో ఈ చిత్రం ప్రసారం కానుంది. యాక్షన్, వినోదంతో కూడిన ఈ సినిమా కోసం సిద్ధంగా ఉండాలంటూ ఛానెల్ నిర్వాహకులు సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక పోస్ట్‌తో అభిమానుల్లో ఆసక్తిని పెంచారు.

2 / 5
రాజారామ్ (అర్జున్ సర్జా), నీలవేణి (అభిరామి) భార్యాభర్తలు. వీరి పిల్లలుగా నీల (ప్రీతి ముకుందన్), ఇళంగో (వివేక్ ప్రసన్న) కనిపిస్తారు. ఇంట్లోనే కరాటే స్కూల్ నడిపే రాజారామ్, తన పిల్లలకు కూడా మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇస్తుంటారు. కుటుంబంలోని సభ్యులంతా మార్షల్ ఆర్ట్స్‌లో నైపుణ్యం కలిగినవారే. అనుకోకుండా ఈ కుటుంబం ఒక కార్పొరేట్ మైనింగ్ సిండికేట్‌తో తలపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

3 / 5
ఆ తర్వాత ఏం జరిగింది? అసలు వివాదం ఏంటి? మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న ఆ కుటుంబం ఎలాంటి పోరాటం చేసింది? అనే ఉత్కంఠభరిత అంశాలతో కథ సాగుతుంది. కొత్త దర్శకుడు సుభాష్ కె.రాజ్ తెరకెక్కించిన ‘బ్లాస్ట్’ చిత్రాన్ని సుమారు రూ.18 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏకంగా రూ.75 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, 2026లో అతిపెద్ద కమర్షియల్ విజయాలలో ఒకటిగా నిలిచింది.

4 / 5
అర్జున్ సర్జా, అభిరామి, ప్రీతి ముకుందన్, వివేక్ ప్రసన్న నటన, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు కనువిందు చేస్తాయి. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనూ దూసుకుపోతున్న ఈ సినిమా, ఇప్పుడు ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు స్టార్ మాలో సందడి చేయనుంది. సుమారు రూ.18 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, మే 28, 2026న థియేటర్లలో విడుదలై భారీ కమర్షియల్ విజయం సాధించింది. థియేట్రికల్ రన్ ముగిసే నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.75 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది

5 / 5
Follow Us