AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suresh Raina: టెర్రస్ గార్డెన్ నుంచి ట్రోఫీ షెల్ఫ్ వరకు.. సింపుల్‌గా కనిపించే రైనా ఇంట్లో ఇన్ని ప్రత్యేకతలా?

Suresh Raina: టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఢిల్లీలోని తన లగ్జరీ బంగ్లాను అభిమానులకు పరిచయం చేశాడు. నలుపు, తెలుపు రంగుల ఇంటీరియర్, ప్రపంచకప్ జ్ఞాపకాలు, ట్రోఫీల గ్యాలరీ, సంతకాలు చేసిన బ్యాట్లు, పియానో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. టెర్రస్‌పై కూరగాయల తోట, వ్యాయామ ప్రదేశం, ధ్యానం చేసుకునే గది కూడా ఉన్నాయి.

Suresh Raina: టెర్రస్ గార్డెన్ నుంచి ట్రోఫీ షెల్ఫ్ వరకు.. సింపుల్‌గా కనిపించే రైనా ఇంట్లో ఇన్ని ప్రత్యేకతలా?
Suresh Raina House
Rakesh
|

Updated on: Nov 25, 2026 | 8:28 AM

Share

Suresh Raina: భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా క్రికెట్ మైదానంలోనే కాదు.. తన వ్యక్తిగత జీవితంలోనూ ప్రత్యేకత చాటుకుంటున్నాడు. తాజాగా ఢిల్లీలోని తన లగ్జరీ ఇంటిని అభిమానులకు పరిచయం చేశాడు. నలుపు, తెలుపు రంగుల కలయికతో అందంగా తీర్చిదిద్దిన ఈ ఇంట్లో క్రికెట్ జ్ఞాపకాలు, ప్రపంచకప్ ట్రోఫీకి సంబంధించిన చిత్రాలు, సంతకాలు చేసిన బ్యాట్లు, పతకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అంతేకాదు.. ఇంటి టెర్రస్‌పై కూరగాయల తోట, వ్యాయామం చేసుకునే ప్రదేశం, ధ్యానం చేసుకునే గది కూడా ఉన్నాయి. రైనా ఇంటి విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తి కలిగిస్తున్నాయి.

నలుపు, తెలుపు రంగుల్లో రైనా ఇల్లు

సురేశ్ రైనా తన భార్య ప్రియాంక చౌదరి, ఇద్దరు పిల్లలతో కలిసి ఢిల్లీలోని లగ్జరీ బంగ్లాలో నివసిస్తున్నాడు. ఇటీవల కర్లీ టేల్స్ బృందానికి తన ఇంటిని చూపించాడు. ఇంటి మొత్తం నలుపు, తెలుపు రంగుల కలయికతో రూపొందించారు. గోడలు, ఫర్నిచర్, సోఫాలు, ఇతర అలంకరణ వస్తువుల్లో ఎక్కువగా బూడిద రంగు ఛాయలు కనిపిస్తాయి. అయితే అక్కడక్కడా రంగురంగుల పెయింటింగ్స్, పూల అలంకరణలు ఇంటికి మరింత అందాన్ని తీసుకొచ్చాయి. ఇంటి ప్రవేశ ద్వారం దగ్గరే రైనా క్రికెట్ ప్రయాణాన్ని గుర్తుచేసే ప్రత్యేక పెయింటింగ్ ఏర్పాటు చేశారు. శ్రీలంకలో జరిగిన తొలి అంతర్జాతీయ మ్యాచ్ నుంచి 2011 ప్రపంచకప్‌ను ముంబైలో అందుకున్న సందర్భం వరకు ఆయన క్రికెట్ జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను అందులో చూపించారు.

ట్రోఫీలు, బ్యాట్లు, పతకాలతో ప్రత్యేక గ్యాలరీ

ఇంట్లోకి వెళ్లగానే విశాలమైన లివింగ్ రూమ్ ఆకట్టుకుంటుంది. అక్కడే డైనింగ్ ఏరియా కూడా ఉంటుంది. పెద్ద కిటికీల ద్వారా సహజమైన వెలుతురు ఇంట్లోకి వస్తుంది. బూడిద రంగు సోఫాలు, మధ్యలో మార్బుల్ టాప్‌తో ఉన్న కాఫీ టేబుల్, నలుపు-తెలుపు రంగుల డైనింగ్ టేబుల్ ఇంటికి ప్రత్యేకమైన రూపాన్ని ఇచ్చాయి. మరోవైపు రెండు ప్రత్యేక సిట్టింగ్ ఏరియాలు ఏర్పాటు చేశారు. వాటిలో ఒకటి ఆకర్షణీయమైన ట్రీ ఆఫ్ లైఫ్ పెయింటింగ్‌కు ఎదురుగా ఉంటుంది. ఇంకొకటి రైనా సాధించిన ట్రోఫీలు, సర్టిఫికెట్లు, సంతకాలు చేసిన బ్యాట్లు, క్యాప్స్, పతకాలు ప్రదర్శించే షెల్ఫ్‌కు ఎదురుగా ఉంటుంది. క్రికెట్‌లో సాధించిన విజయాలన్నీ ఒకేచోట కనిపించేలా ఈ గ్యాలరీని తీర్చిదిద్దారు. అక్కడే తెల్లని రంగులో ఉన్న పియానో కూడా ఉంది. అప్పుడప్పుడు రైనా దానిపై సంగీతం వాయిస్తుంటాడు.

టెర్రస్‌పై కూరగాయల తోట

రైనా ఇంటి టెర్రస్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. విశాలమైన ప్రదేశంలో వరుసగా మొక్కల కుండీలు ఏర్పాటు చేశారు. అందులో టమాటాలు, వంకాయలు, పచ్చిమిర్చితో పాటు దానిమ్మ వంటి పండ్లు, కూరగాయలను స్వయంగా పెంచుతున్నాడు. క్రికెట్‌తో పాటు మొక్కల పెంపకంపై కూడా రైనాకు ఆసక్తి ఉందని ఈ తోట చూస్తే అర్థమవుతుంది. టెర్రస్‌పైనే చిన్న వ్యాయామ ప్రదేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతిరోజూ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టేందుకు ఈ స్థలం ఉపయోగపడుతుంది. అంతేకాదు.. పిల్లలు ఆడుకోవడానికి, తాను ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడానికి ప్రత్యేక గదిని కూడా ఏర్పాటు చేశాడు. ఉదయం వేళల్లో ధ్యానం చేయడం తన దినచర్యలో భాగమని రైనా ఈ ఇంటి పర్యటనలో వెల్లడించాడు.

కోహ్లీ, ధోనీ జెర్సీలకు కూడా ప్రత్యేక స్థానం

రైనా ఇంట్లో ఉన్న బార్ కమ్ మెడిటేషన్ గది మరో ప్రత్యేక ఆకర్షణ. ఈ గది గోడలపై క్రికెట్ జెర్సీలను ప్రదర్శనకు ఉంచారు. వాటిలో రైనా ఉపయోగించిన జెర్సీలతో పాటు విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ ధరించిన జెర్సీలు కూడా ఉన్నాయి. వాటిపై ఆయా ఆటగాళ్ల సంతకాలు ఉండటం విశేషం. టీమిండియాలో ఆటగాళ్ల మధ్య ఉండే అనుబంధం గురించి కూడా రైనా మాట్లాడాడు. మైదానంలో ఇద్దరు ఆటగాళ్లు కలిసి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వ్యక్తిగత స్నేహం, ఒకరిపై మరొకరికి నమ్మకం చాలా ముఖ్యమని చెప్పాడు. ఆటగాళ్లు ఒకరికొకరు మానసికంగా అండగా ఉంటారని వివరించాడు. మైదానంలో కెమెరాలు, అంపైర్లు ప్రతి కదలికను గమనిస్తుంటారని, అందుకే ఆటగాళ్లు తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలని చెప్పాడు. అసాధారణంగా ప్రవర్తిస్తే జరిమానాలు పడే అవకాశం ఉంటుందని వివరించాడు.

మెంటార్‌గా, వ్యాపారవేత్తగా

సురేశ్ రైనా 2020 ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2022 సెప్టెంబర్‌లో అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. భారత జట్టు తరఫున ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన రైనా.. టీమిండియా 2011 వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. టీ20 ప్రపంచకప్‌లో సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు. క్రికెట్‌కు దూరమైన తర్వాత ప్రస్తుతం మెంటార్‌గా, వ్యాపారవేత్తగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. భార్య ప్రియాంక, ఇద్దరు పిల్లలతో కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. తాజాగా బయటపడిన ఇంటి విశేషాలు చూస్తుంటే రైనాకు క్రికెట్‌తో పాటు కుటుంబం, ఫిట్‌నెస్, ప్రకృతి, సంగీతంపై కూడా ఎంత ఆసక్తి ఉందో స్పష్టమవుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సింపుల్‌గా కనిపించే రైనా ఇంట్లో ఇన్ని ప్రత్యేకతలా?
సింపుల్‌గా కనిపించే రైనా ఇంట్లో ఇన్ని ప్రత్యేకతలా?
మళ్లీ నిద్రలేచిన డొనాల్డ్‌ ట్రంప్‌ టారిఫ్‌ పైత్యం..!
మళ్లీ నిద్రలేచిన డొనాల్డ్‌ ట్రంప్‌ టారిఫ్‌ పైత్యం..!
ఏపీలో రేపే తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ర్యాలీలకు నో పర్మిషన్..
ఏపీలో రేపే తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ర్యాలీలకు నో పర్మిషన్..
ఊయల ఊగడం అంటే పిల్లల ఆట కాదు.. పెద్దలకు ఊహించని ఆరోగ్య లాభాలు
ఊయల ఊగడం అంటే పిల్లల ఆట కాదు.. పెద్దలకు ఊహించని ఆరోగ్య లాభాలు
ఏపీలో విషాదం.. కార్తీక దీపాల కోసం వెళ్లి కానరాని లోకాలకు..
ఏపీలో విషాదం.. కార్తీక దీపాల కోసం వెళ్లి కానరాని లోకాలకు..
ఓటీటీలోకి వచ్చేస్తున్న సూర్య హ్యాట్రిక్ హిట్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేస్తున్న సూర్య హ్యాట్రిక్ హిట్ మూవీ..
రూ.18 లక్షల ముంపు పరిహారం డబ్బులపై కన్ను.. భర్త దారుణ హత్య!
రూ.18 లక్షల ముంపు పరిహారం డబ్బులపై కన్ను.. భర్త దారుణ హత్య!
కళ్లముందే మంటల్లో బాలుడు సజీవ దహనం.. కాపాడుకోలేక తల్లి ఆర్తనాదాలు
కళ్లముందే మంటల్లో బాలుడు సజీవ దహనం.. కాపాడుకోలేక తల్లి ఆర్తనాదాలు
పర్వతాల కింద మరో అద్భుతం.. ప్రపంచంలోనే పొడవైన రైల్వే టన్నెల్
పర్వతాల కింద మరో అద్భుతం.. ప్రపంచంలోనే పొడవైన రైల్వే టన్నెల్
త్వరలో వీరందరికి రేషన్ కార్డు కట్.. కేంద్రం బిగ్ డెసిషన్..!
త్వరలో వీరందరికి రేషన్ కార్డు కట్.. కేంద్రం బిగ్ డెసిషన్..!