AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ration Card: వీరందరికి రేషన్ కార్డులు కట్.. సంచలన నిర్ణయం దిశగా కేంద్రం..!

అనర్హత లేకపోయినా రేషన్ కార్డు పొందాలా.. అయితే మీ రేషన్ కార్డు కట్ కానుంది. అవును.. క్షేత్రస్థాయిలో కేంద్రం పరిశీలన చేపడుతోంది. అనర్హులను గుర్తించేందుకు ప్రత్యేక సర్వే చేపడుతోంది. ఇందులో అనర్హులుగా తేలినవారి రేషన్ కార్డులను రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీని వల్ల లక్షలాది మంది తమ రేషన్ కార్డు కోల్పోనున్నట్లు తెలుస్తోంది.

Ration Card: వీరందరికి రేషన్ కార్డులు కట్.. సంచలన నిర్ణయం దిశగా కేంద్రం..!
Ration Card
Venkatrao Lella
|

Updated on: Nov 25, 2026 | 7:33 AM

Share

దేశవ్యాప్తంగా రేషన్ కార్డుల వ్యవస్థలో భారీ మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. పారదర్శకంగా రేషన్ పథకాన్ని అమలు చేసేందుకు నిజమైన లబ్దిదారులకు మాత్రమే ప్రయోజనాలు అందించే దిశగా చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా అక్రమంగా రేషన్ కార్డు పొందినవారిని గుర్తించే పనిని షురూ చేసింది. దీంతో అనర్హత ఉండి అక్రమ పద్దతిలో రేషన్ కార్డు పొందిన లక్షలాది కుటుంబాలకు త్వరలో ప్రభుత్వం చేదువార్తను అందించనుంది. వారి రేష్ కార్డులను రద్దు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పరిశీలిన చేపడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనర్హులను గుర్తిస్తున్నాయి. ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నవారు, కారు కలిగి ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు, అధిక ఆదాయం సంపాదిస్తున్నవారిని గుర్తించింది. విచారణలో వీళ్లు అనర్హులుగా తేలడంతో అలంటివారికి రేషన్ కార్డులను తొలగించనుంది.

అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు కీలకంగా ఉంది. ఉచిత బియ్యం నుంచి ఆరోగ్య బీమా వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సబ్సిడీలు పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి అని చెప్పవచ్చు. ప్రభుత్వ పథకాలు పొందేందుకు కొంతమంది అనర్హులు రేషన్ కార్డు వివిధ మార్గాల్లో పొందినట్లు కేంద్రం గుర్తించింది. ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించేవారితో పాటు ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఉచిత రేషన్ ప్రయోజనాలను పొందుతున్నట్లు పరిశీలనలో బయటపడంది. అలాగే కారు ఉన్నవారు, ఏసీ సౌకర్యం కలిగిన వారు కూడా ఉచిత రేషన్ పొందుతున్నట్లు క్షేత్రస్థాయి అధ్యయనంలో వెల్లడైంది. దీంతో రేషన్ కార్డుల జారీలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేపట్టింది. మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో చాలామంది అనర్హులను గుర్తించింది.

ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) కింద ఉచిత రేషన్ పొందుతున్న వారిలో 13.2 శాతం మంది అనర్హులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ క్షేత్రస్థాయి సర్వేలో తేలింది. అనర్హుల సంఖ్యలో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో ఉండగా.. త్రిపురా, తమిళనాడు, మేఘాలయా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా కొందరు అనర్హులను గుర్తించింది. దీంతో వారి రేషన్ కార్డులను తొలగించేందుకు కేంద్రం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలకు త్వరలోనే ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రేషన్ కార్డుదారులందరికీ ఈకేవైసీ (eKYC) ప్రక్రియను తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఆధార్ ఆధారిత ధృవీకరణతో పాటు ఇతర ప్రభుత్వ రికార్డులను కూడా పరిశీలించి అనర్హులను గుర్తించే అవకాశం ఉంది. ఒకే కుటుంబానికి సంబంధించి అనవసరంగా కొనసాగుతున్న కార్డులు, అర్హత లేని లబ్ధిదారుల వివరాలను కూడా వెలికి తీయాలని భావిస్తున్నారు. కేంద్రం తీసుకోబోతున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా రేషన్ కార్డుల జాబితాలో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

Follow Us