AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్కనెలలో 83 శాతం పెరిగిన Ather Konarc అమ్మకాలు.. ధర, రేంజ్​తోపాటు అదిరే ఫీచర్లు కారణమే!

పెట్రోల్ ధరలు, రోజువారీ ప్రయాణ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఆదరణ పెరుగుతోంది. తక్కువ నిర్వహణ ఖర్చుతో ప్రయాణించాలనుకునే వారు ఈవీలను ఎంచుకుంటున్నారు. ఈ మార్కెట్‌లో ప్రముఖ సంస్థ ఏథర్ ఎనర్జీ తన పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ కొత్త మోడళ్లను తీసుకొస్తోంది. ఈ ఏడాది ఆగస్టు చివరిలో మార్కెట్లోకి వచ్చిన Ather Konarc ఇప్పుడు అమ్మకాల పరంగా మంచి వృద్ధిని నమోదు చేస్తోంది. కంపెనీ సరసమైన ధరలో తీసుకొచ్చిన ఈ స్కూటర్‌కు వినియోగదారుల నుంచి ఆదరణ లభిస్తోంది.

ఒక్కనెలలో 83 శాతం పెరిగిన Ather Konarc అమ్మకాలు.. ధర, రేంజ్​తోపాటు అదిరే ఫీచర్లు కారణమే!
Ather Konarc
Nikhil
|

Updated on: Nov 25, 2026 | 7:20 AM

Share

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్‌లో పోటీ పెరుగుతున్న సమయంలో ఏథర్ ఎనర్జీ అక్టోబర్ 2026లో కూడా మంచి అమ్మకాలను నమోదు చేసింది. ముఖ్యంగా కొత్తగా వచ్చిన కోనార్క్ స్కూటర్ విక్రయాలు ఒక్క నెలలోనే గణనీయంగా పెరగడం ఆసక్తికరంగా మారింది. తక్కువ ధర, ఆకర్షణీయమైన రేంజ్‌, ఆధునిక ఫీచర్లు ఈ మోడల్‌పై కొనుగోలుదారుల ఆసక్తిని పెంచుతున్నాయి. కంపెనీ మొత్తం అమ్మకాల వృద్ధిలోనూ ఈ స్కూటర్ కీలకంగా మారుతోంది.

అక్టోబర్‌లో Ather అమ్మకాలు

ఏథర్ ఎనర్జీ అక్టోబర్ 2026లో మొత్తం 33,786 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో అమ్ముడైన 25,829 యూనిట్లతో పోలిస్తే 30.8 శాతం వృద్ధి నమోదైంది. సెప్టెంబర్ 2026లో విక్రయించిన 30,121 యూనిట్లతో పోలిస్తే నెలవారీ అమ్మకాలు 12.2 శాతం పెరిగాయి. ఇక కోనార్క్ విషయానికి వస్తే.. సెప్టెంబర్‌లో 4,140 యూనిట్లు అమ్ముడవగా, అక్టోబర్‌లో 7,562 యూనిట్లకు చేరాయి. అంటే ఒక్క నెలలోనే 83 శాతం వృద్ధి నమోదైంది.

ప్రస్తుతం ఏథర్ పోర్ట్‌ఫోలియోలో అత్యధికంగా అమ్ముడవుతున్న రెండో స్కూటర్‌గా కోనార్క్ నిలిచింది. రిజ్టా 19,505 యూనిట్లతో మొదటి స్థానంలో ఉండగా, Ather 450 మోడల్ 6,719 యూనిట్ల అమ్మకాలు సాధించింది.

200 కిలోమీటర్ల రేంజ్

Ather Konarc కంపెనీ కొత్త EL ప్లాట్‌ఫామ్‌పై రూపొందించిన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్. ఆగస్టు చివరిలో నిర్వహించిన కమ్యూనిటీ డే కార్యక్రమంలో దీనిని ఆవిష్కరించారు. ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.99,999గా నిర్ణయించారు. S-సిరీస్, Z-సిరీస్ అనే రెండు సిరీస్‌లలో ఈ స్కూటర్‌ను ప్రకటించారు. అయితే అన్ని వేరియంట్ల అమ్మకాలు, డెలివరీలు ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది.

కంపెనీ సమాచారం ప్రకారం కోనార్క్ గరిష్టంగా 200 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. S-సిరీస్ వేరియంట్‌ రేంజ్‌ 161 కిలోమీటర్లుగా ఉంది. ఇందులో 7 అంగుళాల TFT డిస్‌ప్లే, టర్న్ బై టర్న్ నావిగేషన్, కాల్స్, మ్యూజిక్ కంట్రోల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. బేస్ వేరియంట్‌లో చిన్న డిస్‌ప్లే అందించారు. OTA అప్‌డేట్స్, రిమోట్ ఛార్జింగ్ స్టేటస్, దొంగతనం హెచ్చరికలు, స్మార్ట్ కీ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. తక్కువ ధరలో మెరుగైన రేంజ్‌, స్మార్ట్ ఫీచర్లు కోరుకునే వారికి ఈ స్కూటర్ ఆకర్షణీయమైన ఆప్షన్‌గా నిలుస్తోంది.

Follow Us