AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్క్రీన్​ లేకుండా పని చేసే AI డివైజ్​.. టీజర్​లో ఆసక్తికర డిజైన్​తో ఇంట్రెస్ట్​ పెంచేసిన నథింగ్​

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ప్రత్యేకమైన డిజైన్‌తో గుర్తింపు తెచ్చుకున్న Nothing కంపెనీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్లు, ఇయర్‌బడ్స్‌తో యూజర్లను ఆకట్టుకున్న ఈ సంస్థ.. తాజాగా ఒక కొత్త ఏఐ ఆధారిత పరికరాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 8న ఈ డివైస్‌ను పరిచయం చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అయితే పరికరం పేరు, ధర, పూర్తి ఫీచర్లను కంపెనీ ఇంకా బయటపెట్టలేదు.

స్క్రీన్​ లేకుండా పని చేసే AI డివైజ్​.. టీజర్​లో ఆసక్తికర డిజైన్​తో ఇంట్రెస్ట్​ పెంచేసిన నథింగ్​
Nothing Ai Device
Nikhil
|

Updated on: Nov 25, 2026 | 6:30 AM

Share

ప్రస్తుతం టెక్నాలజీ ప్రపంచంలో ఏఐ ఆధారిత గ్యాడ్జెట్లకు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో Nothing తీసుకురాబోతున్న కొత్త పరికరంపై ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు విడుదల చేసిన టీజర్లు, కంపెనీ సీఈఓ కార్ల్ పీ ఇచ్చిన సంకేతాలను బట్టి చూస్తే.. ఇది సాధారణ స్మార్ట్‌ఫోన్‌కు భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా స్క్రీన్ లేకుండా పనిచేసే ప్రత్యేక ఏఐ పరికరంగా దీన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

Nothing AI Device పరిచయం

Nothing తన తాజా సోషల్ మీడియా పోస్టులో డిసెంబర్ 8 తేదీని ప్రకటించింది. విడుదల చేసిన పోస్టర్‌లో గుండ్రటి మెటల్ భాగం కనిపిస్తోంది. దాని చుట్టూ వెండి, నలుపు రంగుల్లో మెరిసే రింగులు ఉన్నాయి. అయితే ఈ చిత్రం ఆధారంగా డివైస్ అసలు రూపాన్ని నిర్ధారించడం సాధ్యం కాదు.

కంపెనీ సీఈఓ కార్ల్ పీ గతంలో ఈ పరికరం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. డిసెంబర్‌లో కొత్త డివైస్‌ను తీసుకొస్తామని, దీనికి స్క్రీన్ ఉండదని తెలిపారు. ఇది స్మార్ట్‌ఫోన్‌లో ఉపయోగించే మరో యాప్‌లా కాకుండా ప్రత్యేకంగా పనిచేసే పరికరమని వివరించారు. Nothing ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచే డిజైన్‌ ఇందులోనూ ఉంటుందని చెప్పారు.

వాయిస్ కమాండ్స్‌తో ఏఐ పనులు

గతంలో విడుదల చేసిన టీజర్లలో మెటల్ బాడీ, గుండ్రని అంచులు, ఫిజికల్ బటన్ కనిపించాయి. ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో రెండు చిన్న LED లైట్లు కూడా ఉన్నాయి. తాజాగా వచ్చిన లీక్‌ల ప్రకారం ఈ పరికరం చిన్న దీర్ఘచతురస్రాకార ఆకారంలో ఉండొచ్చని తెలుస్తోంది. దానిపై ‘Talk’ అని రాసి ఉన్న ప్రత్యేక బటన్‌తో పాటు గుండ్రటి కంట్రోల్ ఉండే అవకాశం ఉందని సమాచారం. అయితే ఇవన్నీ అధికారికంగా ధ్రువీకరించిన వివరాలు కావు.

ఈ ఏఐ డివైస్‌తో వాయిస్ రికార్డింగ్, మాట్లాడిన మాటలను ఇతర భాషల్లోకి అనువదించడం, ముఖ్యమైన విషయాలను నోట్స్‌గా భద్రపరచడం వంటి పనులు చేయవచ్చని అంచనా. వాయిస్ కమాండ్స్ లేదా ఫిజికల్ బటన్ల ద్వారా ఉపయోగించుకునే అవకాశం ఉంది. అయితే Nothing ఇప్పటివరకు ఈ ఫీచర్లను నిర్ధారించలేదు. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లు, ఇయర్‌ఫోన్లతో పాటు CMF బ్రాండ్ కింద స్మార్ట్‌వాచ్‌లు, స్పీకర్లను విక్రయిస్తున్న సంస్థ.. ఈ కొత్త విభాగంలో ఎలాంటి పరికరాన్ని తీసుకొస్తుందో డిసెంబర్ 8న తెలియనుంది. ధర, అమ్మకాల ప్రారంభ తేదీపై ఇంకా స్పష్టత లేదు.

Follow Us