AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: తగ్గేదేలే.. దూసుకెళ్తున్న బంగారం ధరలు.. వరుసగా మూడోరోజు కూడా నిరాశే.. ఇవాళ తులం ఎంతంటే..?

ఇటీవల భారీగా పడిపోయిన బంగారం ధరలు ఈ వారం ప్రారంభం నుంచి తిరిగి పుంజుకుంటున్నాయి. దీంతో పసిడి ప్రియులకు షాక్ తగిలింది. దేశీయ మార్కెట్లో బంగారం రేట్లు మూడో రోజు కూడా గణనీయంగా పెరిగాయి. బుధవారం మరోసారి పెరిగి నిరాశపర్చాయి. నవంబర్ 25న బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold Prices: తగ్గేదేలే.. దూసుకెళ్తున్న బంగారం ధరలు.. వరుసగా మూడోరోజు కూడా నిరాశే.. ఇవాళ తులం ఎంతంటే..?
Gold Prices
Venkatrao Lella
|

Updated on: Nov 25, 2026 | 6:34 AM

Share

గత వారంలో బంగారం ధరలు తగ్గడంతో ఈ వారం మరింత తగ్గుతాయని ఎదురుచూసిన కొనుగోలుదారులకు షాక్ తగిలింది. ఈ వారంలో పసిడి ధరల వరుస పెరుగుదుల నిరాశపరుస్తోంది. బుధవారం కూడా బంగారం ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో మారుతున్న పరిస్థితులు, పెట్టుబడిదారుల వైఖరిలో వస్తున్న మార్పులు బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై వస్తున్న అంచనాలు వంటి అంతర్జాతీయ పరిణామాలు బంగారంపై పెట్టుబడుల ఆసక్తిని మళ్లీ పెంచుతున్నాయి.  అయితే వెండి ధరలు మాత్రం తగ్గుతున్నాయి.

గోల్డ్ రేట్లు ఇవే..

-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,27,810 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,17,160 పలుకుతోంది.

-విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,27,810కు లభిస్తుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,17,160గా ఉంది.

-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,27,910 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,17,310 వద్ద ట్రేడవుతోంది.

-చెన్నైలో 24 క్యారెట్ల బంగార ధర రూ.1,27,810 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,17,160 వద్ద ట్రేడవుతోంది.

-బెంగళూరులో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,27,810కు లభిస్తుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,17,160 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?

వెండి ధరలు మాత్రం కాస్త భిన్నంగా ఉన్నాయి. బంగారం ధరలు పెరుగుతుండగా.. సిల్వర్ ధరలు మాత్రం పతనమవుతన్నాయి. బంగారం కేవలం ఆభరణాల కోసం మాత్రమే ఉపయోగిస్తారు. కానీ వెండిని పారిశ్రామిక అవసరాల కోసం కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు. డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్ వెహికల్స్ వంటి వాటిల్లో సిల్వర్ ఉపయోగిస్తారు. దీంతో గోల్డ్‌తో పోలిస్తే వెండి ధరల్లో మార్పులు వేగవంతంగా ఉంటాయి. ప్రస్తుతం ఢిల్లీలో కిలో వెండి రూ.1,74,900గా ఉంది. మంగళవారం ఈ రేటు రూ.1.75 లక్షలుగా ఉంది. హైదరాబాద్‌లోనూ కేజీ సిల్వర్ ధర రూ.1,74,900 వద్ద పలుకుతోంది.

ధరల పెరుగుదలకు కారణాలు ఏంటి..?

బంగారం ధరల పెరుగుదలకు అంతర్జాతీయ మార్కెట్లోని అనేక అంశాలు కారణమవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో మారుతున్న పరిస్థితులు, పెట్టుబడిదారుల వైఖరిలో వస్తున్న మార్పులు బంగారం ధరలు పెరగడానికి కారణమవుతున్నట్లు తెలుస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొంతవరకు తగ్గుముఖం పట్టడం, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల్లో వస్తున్న మార్పుల వల్ల బంగారంలో పెట్టుబడులు పెరుగుతుండటం వల్ల ధరలు పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నాయి.  అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు పసిడి ధరలపై గణనీయమైన ప్రభావాన్ని చూపించే అవకాశముంది. ద్రవ్యోల్బణం పెరుగుతుందనే ఆందోళనలు ఉంటే ఫెడ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంటుంది. దీనివల్ల వడ్డీ ఆదాయం అందించని బంగారం కంటే బాండ్లు వంటి ఇతర వడ్డీ ఆధారిత పెట్టుబడుల వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతారు. తద్వారా బంగారం ధరలపై ఒత్తిడి ఏర్పడుతుంది.

Follow Us