24 November 2026
Subhash
ప్రస్తుతం ప్రతి ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ తప్పనిసరిగా ఉంటుంది. అయితే కొన్ని తప్పులు చేస్తే మీ వాట్సాప్ అకౌంట్‌పై నిషేధం పడే ప్రమాదం ఉంది. అవేంటో తెలుసుకుందాం.
వాట్సాప్‌లో వచ్చే ప్రతి మెసేజ్ నిజమని నమ్మకండి. తప్పుడు వార్తలు, పుకార్లను నిర్ధారించుకోకుండా ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దు.
కులాలు, మతాలు లేదా ఇతర వర్గాల మధ్య ద్వేషాన్ని పెంచే సందేశాలు, బెదిరింపులు పంపడం నిబంధనల ఉల్లంఘనకు దారితీయవచ్చు.
అశ్లీల ఫొటోలు, వీడియోలు లేదా నిషేధిత కంటెంట్‌ను ఇతరులకు పంపడం వల్ల మీ అకౌంట్‌పై చర్యలు తీసుకోవచ్చు.
ఎవరినైనా వారి అనుమతి లేకుండా వాట్సాప్ గ్రూపుల్లో చేర్చవద్దు. ఇలా చేస్తే వారు మీపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది.
తెలియని వ్యక్తులకు పదేపదే మెసేజ్‌లు పంపడం, వారు వద్దన్నా సందేశాలు పంపడం మానుకోండి. స్పామ్‌గా రిపోర్ట్ అయ్యే ప్రమాదం ఉంది.
అనధికారిక యాప్స్ ఉపయోగించి భారీగా ఆటోమేటిక్ మెసేజ్‌లు పంపడం, ఇతరుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం వాట్సాప్ నిబంధనలకు విరుద్ధం.
వాట్సాప్ అకౌంట్ సురక్షితంగా ఉండాలంటే అధికారిక యాప్ మాత్రమే ఉపయోగించండి. ఇతరుల అనుమతిని గౌరవించండి. వాట్సాప్ నిబంధనలు పాటించండి.