భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ రెడీ.. ట్రయల్ రన్ ఎప్పుడంటే?

Venkatrao Lella

Images: Pinterest

24 NOV 2026

దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్‌ను పట్టాలెక్కించేందుకు ముమ్మర  ప్రయత్నాలు జరుగుతున్నాయి. పనులు దాదాపుగా పూర్తి కావొస్తున్నాయి.

వచ్చే ఏడాది ఆగస్ట్ 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తొలి బుల్లెట్ రైలును పరుగులు పెట్టించాలని రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లను కూడా చకాచకా పూర్తి చేసే పనిలో నిమగ్నమైంది. 

వచ్చే ఏడాదిలో బుల్లెట్ ట్రైన్ ట్రయల్ రన్ ప్రారంభం కానుంది. ట్రైన్ ప్రారంభానికి ముందు ట్రయల్ రన్ నిర్వహిస్తారు.

ఈ ట్రయల్ రన్‌కు సంబంధించి రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక అప్డేట్ ఇచ్చారు. 2027 మే నెలలో ట్రయల్ రన్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 

ట్రయల్ రన్ కోసం దాదాపుగా బుల్లెట్ ట్రైన్ సిద్దంగా ఉందని అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్‌లో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ కారిడార్ మొత్తం 508 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఇందులో సూరత్-బలిమోరా సెక్షన్ మధ్య తొలి రైలు ప్రవేశపెట్టనున్నారు.

ఇప్పటికే  ఈ సెక్షన్‌లో 50 కిలోమీటర్ల మేర విద్యుత్ పనులు పూర్తయినట్లు రైల్వేశాఖ తెలిపింది.  సిగ్నలింగ్ పనులు జనవరి 2027లో పూర్తి అవుతాయని అధికారులు చెబుతున్నారు.

సిగ్నలింగ్ పనులు పూర్తయిన తర్వాత మొదటి బుల్లెట్ రైలు ట్రయల్ నిర్వహించనున్నారు. ఈ ట్రాక్‌పై గంటకు 280 కి.మీ వేగంతో బుల్లెట్ ట్రైన్ ప్రయాణించనుంది

దేశంలో మొత్తం ఏడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లను కేంద్రం ప్రకటించింది. మిగతా కారిడార్ల పనులు ఇంకా మొదలుకాలేదు.