Chicken Shop Business: చికెన్ షాప్ వ్యాపారం.. కిలోకు ఎంత లాభమో తెలుసా? అసలు లెక్కలు ఇవే..!
Chicken Shop Business: ఈ వ్యాపారం ప్రారంభించే ముందు మీ మున్సిపాలిటీలో మీట్ షాప్ పర్మిషన్, FSSAI రిజిస్ట్రేషన్ గురించి తప్పకుండా కనుక్కోవాలి. నిరంతర శ్రమ, సరైన ప్రణాళిక, కస్టమర్ నమ్మకాన్ని గెలుచుకోవడం ద్వారా చికెన్ షాప్ వ్యాపారంలో స్థిరమైన లాభాలను ఆర్జించవచ్చు..

Chicken Shop Business: చికెన్ షాప్ వ్యాపారం తెలుగు రాష్ట్రాలలో అత్యంత సాధారణమైన, లాభదాయకమైన వ్యాపారాలలో ఒకటిగా కనిపిస్తుంది. అయితే, ఈ వ్యాపారం వెనుక ఉన్న వాస్తవ లెక్కలు, పెట్టుబడులు, రిస్కులు, సవాళ్లు చాలా మందికి తెలియవు. సాధారణంగా ఒక కిలో కోడిని 130 రూపాయలకు కొని, స్కిన్‌లెస్ చికెన్‌ను 300 రూపాయలకు అమ్మినప్పుడు కిలో మీద 170 రూపాయల లాభం వస్తుందని చాలా మంది భావిస్తారు. కానీ, ఈ అంచనా వాస్తవానికి చాలా దూరమంటున్నారు వ్యాపారులు.
లాభం వెనుక అసలు లెక్కలు:
ఒక రెండు కిలోల బరువున్న బతికున్న కోడిని 130 రూపాయల చొప్పున 260 రూపాయలకు కొంటారు. కోడిని కోసిన తర్వాత ఈకలు, తల, కాళ్లు, పేగులు, రక్తం తొలగిపోతాయి. స్కిన్‌లెస్ మాంసం అడిగితే, చర్మం కూడా తీసివేయాలి. అప్పుడు రెండు కిలోల కోడి నుండి సుమారు 1.2 కిలోల స్కిన్‌లెస్ మాంసం మాత్రమే మిగులుతుంది. అంటే, కొన్న 260 రూపాయలకు 1.2 కిలోల మాంసం మాత్రమే వస్తుంది. దీనిని 300 రూపాయల చొప్పున అమ్మితే 360 రూపాయలు వస్తాయి. ఈ లెక్కన, ఒక కోడి మీద షాప్ యజమానికి సుమారు 100 రూపాయల లాభం మిగులుతుంది. దీనిని కిలోకు లెక్కిస్తే, అసలు ఖర్చు దాదాపు 217 రూపాయలు. అందుకే కిలో మీద వచ్చే నిజమైన లాభం 80 రూపాయలు మాత్రమే.
ప్రారంభ పెట్టుబడి, రోజువారీ ఖర్చులు:
చికెన్ షాప్ ప్రారంభించడానికి షాప్ అడ్వాన్స్, టైల్స్, కోళ్ల బోనులు, తూకం మిషన్, డీప్ ఫ్రీజర్లు, కత్తులు, మొదటి రోజు సరుకు కోసం సుమారు 1.5 లక్షల నుండి 3 లక్షల రూపాయల వరకు పెట్టుబడి అవసరం. రోజువారీ, నెలవారీ ఖర్చులు కూడా లాభాలను గణనీయంగా ప్రభావితం చేస్తాయి. ఒక సగటు షాప్ నెలకు 8,000 రూపాయల అద్దె, ఒక సహాయకుడికి 12,000 రూపాయల జీతం, కరెంట్, ఫ్రీజర్, నీటి బిల్లుల కోసం 2,500 రూపాయలు, ఆటో రవాణాకు 3,000 రూపాయలు, కవర్లు, ఇతర చిన్న ఖర్చులకు 1,500 రూపాయలు ఖర్చు చేయవచ్చు. దీనికి అదనంగా, రవాణాలో చనిపోయే కోళ్లు, లేదా తరుగు (shrinkage) కారణంగా మరో 6,000 రూపాయల నష్టం ఉండవచ్చు. ఇలా మొత్తం నెలకు సుమారు 33,000 రూపాయల ఖర్చు అవుతుంది.
ఆదాయం:
ఒక చిన్న పట్టణంలోని మంచి షాప్ వారంలో 30 కిలోలు. ఆదివారం 80 కిలోల వరకు అమ్మగలదు. సగటున రోజుకు 40 కిలోల అమ్మకాలు జరిగితే, కిలోకు 80 రూపాయల లాభం చొప్పున రోజుకు 3,200 రూపాయలు. నెలకు 96,000 రూపాయలు ఆదాయం వస్తుంది. ఇందులోంచి ఖర్చులు తీసివేస్తే, మంచి నెలలో యజమాని చేతికి సుమారు 63,000 రూపాయలు మిగులుతాయి. అయితే, కార్తీక మాసం, శ్రావణ మాసం వంటి పండుగ నెలల్లో అమ్మకాలు గణనీయంగా తగ్గిపోతాయి. ఈ నెలల్లో ఆదాయం 15,000 రూపాయలకు పడిపోవచ్చు. కానీ అద్దె, జీతాలు వంటి స్థిర ఖర్చులు మాత్రం మారవు. దీనివల్ల సంవత్సర సగటు ఆదాయం నెలకు సుమారు 55,000 రూపాయలకు తగ్గుతుంది. ఈ సంపాదన కోసం షాప్ యజమాని ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు, దాదాపు సెలవులు లేకుండా పని చేయాల్సి ఉంటుంది.
పౌల్ట్రీ ఫీడ్ రేట్లు పెరగడం కూడా ఒక పెద్ద సవాలు. మొక్కజొన్న వంటి ప్రధాన ఆహార ధాన్యాల ధరలు పెరిగినప్పుడు, కోడి ధరలు కూడా పెరుగుతాయి. షాప్ యజమాని వెంటనే ధరలను పెంచలేడు. ఎందుకంటే కస్టమర్లు పక్క షాప్‌కు వెళ్ళే అవకాశం ఉంది. ఈ భారం లాభాల నుండే భరించాల్సి వస్తుంది.
ఈ వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందడానికి కొన్ని ట్రిక్స్:
1. బల్క్ ఆర్డర్లు: బిర్యానీ పాయింట్లు, హోటళ్లు, క్యాటరింగ్ వంటి వాటికి సరఫరా చేయడం ద్వారా స్థిరమైన అమ్మకాలు పొందవచ్చు.
2. విభిన్న కట్స్: బోన్‌లెస్, లివర్, గిజార్డ్ వంటి వాటిని వేరుగా అమ్మడం ద్వారా ఎక్కువ ఆదాయం. 3. నమ్మకం: సరిగ్గా తూకం వేయడం, నాణ్యతను పాటించడం ద్వారా కస్టమర్లను నిలుపుకోవచ్చు. 4. పరిశుభ్రత: ఈగలు, వాసన లేని పరిశుభ్రమైన షాప్ ఆడవారిని కూడా ఆకర్షిస్తుంది.
ఈ వ్యాపారం ప్రారంభించే ముందు మీ మున్సిపాలిటీలో మీట్ షాప్ పర్మిషన్, FSSAI రిజిస్ట్రేషన్ గురించి తప్పకుండా కనుక్కోవాలి. నిరంతర శ్రమ, సరైన ప్రణాళిక, కస్టమర్ నమ్మకాన్ని గెలుచుకోవడం ద్వారా చికెన్ షాప్ వ్యాపారంలో స్థిరమైన లాభాలను ఆర్జించవచ్చు.
ఇది కూడా చదవండి: Gold Adulteration: బంగారంలో కొత్త కల్తీ మోసం.. హాల్‌మార్క్ ఉన్నా స్వచ్ఛతకు గ్యారెంటీ లేదా? వెలుగులోకి షాకింగ్ విషయం!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయం
