AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మళ్లీ పాన్ ఇండియా మూవీలో మంచు విష్ణు.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే మైండ్ బ్లాంకే !!

మంచు విష్ణు... కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. గత ఏడాది జూన్ 27న ఆయన నటించిన కన్నప్ప సినిమా ప్రేక్షకులను అలరించడంలో మాత్రం విఫలమైంది. అయితే మంచి విష్ణు మాత్రం పాన్ ఇండియాని ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదని తెలుస్తోంది.

మళ్లీ పాన్ ఇండియా మూవీలో మంచు విష్ణు.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే మైండ్ బ్లాంకే !!
Manchu Vishnu
Korivi Jayakumar
|

Updated on: Nov 24, 2026 | 9:19 PM

Share

మంచు విష్ణు… కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తనదైన శైలిలో విభిన్న చిత్రాలు చేస్తూ ఢీ, దేనికైనా రెఢీ వంటి చిత్రాలతో మంచి హిట్స్ అందుకొని ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే గత కొన్నాళ్లుగా ఆయన నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతూ వస్తున్నాయి. దీంతో స్టార్ హీరో రేంజ్ కి ఎదగలేకపోతున్నారు. దీంతోనే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ ‘కన్నప్ప’ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా రేంజ్ లో గత ఏడాది జూన్ 27న విడుదలై ప్రేక్షకులను అలరించడంలో మాత్రం విఫలమైంది.

భారీ తారాగణం.. కానీ మూవీ ఫ్లాప్ !!

కాగా ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన కన్నప్ప మూవీలో.. ప్రభాస్ ‘రుద్ర’ పాత్రలో కనిపించారు. అలానే మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ సహా పలువురు ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాతోనే విష్ణు ముగ్గురు పిల్లలు కూడా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సినిమా మొదటి రోజు మంచి కలెక్షన్లు రాబట్టినప్పటికీ, తర్వాత బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ రెస్పాన్స్‌తో నెమ్మదించింది. మొత్తంగా భారీ నష్టాలతోనే ఫుల్ రన్ ముగించిందని సినీ వర్గాల్లో చర్చ నడిచింది. అయితే మంచి విష్ణు మాత్రం పాన్ ఇండియాని ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదని తెలుస్తోంది.

కొత్త మూవీ అనౌన్స్..

మంచు విష్ణు తాజాగా మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తన బర్త్ డే సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త సినిమాకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు. విష్ణు కెరీర్‌ లో 24వ సినిమాగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌ కు VM24 అనే వర్కింగ్ టైటిల్‌ పెట్టారు. అంతే కాకుండా ఈ చిత్రాన్ని ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా దర్శకత్వం చేయనున్నట్టు రివీల్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక పోస్ట్ పెట్టారు. దీంతో ఈ వ్యవహారం ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

మరోవైపు ఈ సినిమా కథ, హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇక ప్రభుదేవా డాన్స్ మాస్టర్‌ గా కెరీర్ ప్రారంభించి హీరోగా ఎదిగారు. ఆ తర్వాత దర్శకుడిగానూ నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. పౌర్ణమి వంటి సినిమాలతో టాలెంట్ నిరూపించుకున్నారు. అలానే కన్నప్ప సినిమాలో కూడా ప్రభుదేవా కొరియోగ్రాఫర్‌ గా పనిచేసిన సంగతి తెలిసిందే.

Manchu Vishnu (1)

Manchu Vishnu (1)

Follow Us