AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akkineni : అన్నపూర్ణ సంస్థకు ఈ సినిమా చాలా ప్రత్యేకం.. 1967లో బాక్సాఫీస్ షేక్ చేసిన అక్కినేని మూవీ ఇదే..

టాలీవుడ్ నటుడు అక్కినేణి నాగేశ్వరరావుకు విజయవంతమైన పునరాగమనం అందించిన ఒక కీలక సినిమా. దుక్కిపాటి మధుసూదనరావు సారథ్యంలో అన్నపూర్ణ పిక్చర్స్ తొమ్మిదవ నిర్మాణంగా రూపొందిన ఈ సినిమా, అనేక ఆసక్తికర సంఘటనలు, నూతన పరిచయాలతో నిండి ఉంది. ఏఎన్నార్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

Akkineni : అన్నపూర్ణ సంస్థకు ఈ సినిమా చాలా ప్రత్యేకం.. 1967లో బాక్సాఫీస్ షేక్ చేసిన అక్కినేని మూవీ ఇదే..
Poolarangadu
Rajitha Chanti
|

Updated on: Nov 24, 2026 | 6:52 PM

Share

తెలుగు సినిమా చరిత్రలో “పూలరంగడు” చిత్రం ఒక చక్కటి వినోదభరితమైన, ముఖ్యమైన మైలురాయి. నటసామ్రాట్ అక్కినేణి నాగేశ్వరరావు హీరోగా, దుక్కిపాటి మధుసూదనరావు సారథ్యంలోని అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థ తెలుగులో నిర్మించిన తొమ్మిదవ సినిమా ఇది. 1960ల ద్వితీయార్థంలో అక్కినేణి కొన్ని వరుస పరాజయాలను చవిచూస్తున్న తరుణంలో, 1967 నవంబర్ 24న విడుదలైన ఈ చిత్రం ఆయనకు భారీ విజయాన్ని అందించి, కెరీర్ కు ఊపిరిపోసింది. అన్నపూర్ణ పిక్చర్స్ ను ఏఎన్నార్ కు వైవిధ్యమైన పాత్రలు అందించడం కోసం దుక్కిపాటి మధుసూదనరావు స్థాపించారు. ఈ బ్యానర్‌పై తొలి చిత్రంగా అక్కినేణి హీరోగా కె.వి.రెడ్డి దర్శకత్వంలో “దొంగరాముడు” నిర్మించారు. “పూలరంగడు” ఈ బ్యానర్‌లో నిర్మించిన తొమ్మిదవ చిత్రం. “దొంగరాముడు” తర్వాత జమున మళ్ళీ అన్నపూర్ణ సంస్థలో హీరోయిన్‌గా నటించిన సినిమా ఇదే. అప్పట్లో ఆమె “దొంగరాముడు”లో చెల్లెలి పాత్రలో కనిపించగా, “పూలరంగడు”లో అక్కినేణికి జోడిగా నటించారు. అలాగే, విజయనిర్మల అక్కినేణి చెల్లెలి పాత్రలో నటించారు, అక్కినేణితో ఆమెకు ఇదే తొలి సినిమా.

ఈ చిత్రంతోనే తెలుగునాట రచయిత్రి రంగనాయకమ్మ సినిమా సంభాషణల రచయిత్రిగా పరిచయం కావడం విశేషం. అంతేకాదు, ఒక కొత్త గాయకుడు కె.బి.కె. మోహనరాజు కూడా “పూలరంగడు” చిత్రంతోనే పరిచయమయ్యారు. ఆయన పాడిన “చిగురులు వేసిన కలలన్నీ” పాట బాగా పాపులర్ అయింది. అయితే, ప్రభుత్వ ఉద్యోగి కావడంతో మోహనరాజు ఉద్యోగాన్ని, సినీ కెరీర్‌ను బ్యాలెన్స్ చేయలేక చిత్ర రంగానికి దూరమయ్యారు. హాస్య జంటగా పద్మనాభం, గీతాంజలి నటించగా, చలం నరసింహులుగా కనిపించారు. చిత్తూరు వి. నాగయ్య వీరయ్య పాత్రలో నటించి, “చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే” పాటను తానే పాడుకున్నారు. తన సొంత చిత్రం “రామదాసు” తర్వాత నాగయ్య స్వయంగా పాట పాడుకోవడం “పూలరంగడు”లోనే, అంతేకాదు, సినిమాల్లో ఆయనకు ఆఖరి పాట ఇదే.

“పూలరంగడు” చిత్రానికి మొదట గొల్లపూడి మారుతీరావును రచయితగా అనుకున్నా, బదిలీ కారణంగా ముళ్ళపూడి వెంకటరమణను రచయితగా తీసుకున్నారు. ముళ్ళపూడి కథ, సంభాషణలు రాసినా, టైటిల్స్ లో ఆయన పేరు కథకుడుగా మాత్రమే ఉండటంతో మనస్తాపం చెందారు. ఆ తర్వాత దుక్కిపాటి పిలిచినా పనిచేయడానికి నిరాకరించారు. దాదాపు 15 సంవత్సరాల తర్వాత బాపు దర్శకత్వంలో దుక్కిపాటి నిర్మించిన “పెళ్ళీడు పిల్లలు” చిత్రానికి మాత్రమే రచన చేశారు. ఈ సినిమాలో నిజానికి శోభన్ బాబుకు పాత్ర లేదు. కానీ చిన్న వేషమైనా ఇవ్వాల్సిందేనని అల్లు రామలింగయ్య ధర్నాకు దిగడంతో, దుక్కిపాటి ఆయనకు పోలీస్ మామయ్య పాత్రను ఇచ్చారు.

ఈ సినిమా అన్నదమ్ముల సెంటిమెంట్‌కు భిన్నంగా అన్న-చెల్లెళ్ల సెంటిమెంట్‌తో రూపుదిద్దుకుంది. “పూలరంగడు” టాకీ పార్ట్ ను హైదరాబాద్ లో, పాటలను మద్రాస్, ఊటీలలో చిత్రీకరించారు. బ్లాక్ అండ్ వైట్ లో నిర్మించిన ఈ చిత్రంలో “నీ జిలుగు పైట నీడలోన” పాటను మాత్రం అక్కినేణి, జమునల మీద రంగుల్లో తీయడం అప్పట్లో ఒక వినూత్న ప్రయత్నం. హైదరాబాద్ లోని బేగంపేట రైల్వే స్టేషన్ ఆవరణలో జట్కాబండి సన్నివేశాలను చిత్రీకరించారు. ఏడాది పాటు నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రం 1967 అక్టోబర్ 4న సెన్సార్ పూర్తి చేసుకుంది. అదే ఏడాది అక్కినేణి నటించిన “గృహలక్ష్మి”, “ప్రాణమిత్రులు”, “వసంతసేన” వంటి చిత్రాలు ఆర్థికంగా విజయం సాధించకపోవడంతో, “పూలరంగడు” విజయం ఏఎన్నార్ కెరీర్ కు చాలా కీలకంగా మారింది. విడుదలైన తొలిరోజునే “పూలరంగడు” సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని, రోజురోజుకీ వసూళ్లను పెంచుకుంటూ, అప్పటివరకు అన్నపూర్ణ సంస్థ నిర్మించిన అన్ని చిత్రాలకంటే అత్యధిక వసూళ్లు సాధించి, ఏఎన్నార్ సినీ జీవితంలో ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించింది.

Follow Us
1967లో బాక్సాఫీస్ షేక్ చేసిన అక్కినేని మూవీ ఇదే..
1967లో బాక్సాఫీస్ షేక్ చేసిన అక్కినేని మూవీ ఇదే..
నవంబర్ 30వ తేదీలోగా ఈ పని పూర్తి చేసుకోండి.. లేకుంటే ఇబ్బందులే..!
నవంబర్ 30వ తేదీలోగా ఈ పని పూర్తి చేసుకోండి.. లేకుంటే ఇబ్బందులే..!
రెండు లీటర్లు పాలు తాగినా రాని శక్తి .. ఇలా కొర్రలతో చేసిన పలావ్
రెండు లీటర్లు పాలు తాగినా రాని శక్తి .. ఇలా కొర్రలతో చేసిన పలావ్
మునిగిపోతున్న రెండేళ్ల చిన్నారిని కాపాడిన కుక్కపిల్ల..!
మునిగిపోతున్న రెండేళ్ల చిన్నారిని కాపాడిన కుక్కపిల్ల..!
తిరుమల వెళ్లే భక్తులకు అండగా టీటీడీ..
తిరుమల వెళ్లే భక్తులకు అండగా టీటీడీ..
ప్రాణం తీసిన స్నేహం.. అర్ధరాత్రి కత్తులతో వేటాడి దారుణ హత్య..
ప్రాణం తీసిన స్నేహం.. అర్ధరాత్రి కత్తులతో వేటాడి దారుణ హత్య..
నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’.. ఆకట్టుకుంటోన్న ‘అప్సర’ సాంగ్
నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’.. ఆకట్టుకుంటోన్న ‘అప్సర’ సాంగ్
వామ్మో.. కారుకు పెట్రోల్ బదులు డీజిల్ పోస్తే ఏం జరుగుతుందో తెలుసా
వామ్మో.. కారుకు పెట్రోల్ బదులు డీజిల్ పోస్తే ఏం జరుగుతుందో తెలుసా
 చిరిగిన స్వెటర్‌తో ఇన్ని ప్రయోజనాలా? ఇకపై అస్సలు పడేయకండి!
 చిరిగిన స్వెటర్‌తో ఇన్ని ప్రయోజనాలా? ఇకపై అస్సలు పడేయకండి!
పాకిస్థాన్‌లో బయటపడ్డ జైషే ఉగ్రవాద శిబిరాల గుట్టు..!
పాకిస్థాన్‌లో బయటపడ్డ జైషే ఉగ్రవాద శిబిరాల గుట్టు..!