AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramayana Movie: మూవీ లవర్స్‌కు గుడ్‌ న్యూస్.. ‘రామాయణ’ సినిమా టికెట్ ధరలు భారీగా తగ్గింపు.. కొత్త రేట్స్ ఇవే

దీపావళి కానుకగా నవంబర్ 05న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన రామాయణ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఇప్పటికే ఈ సినిమా వసూళ్లు రూ.1700 కోట్లను దాటేసినట్లు తెలుస్తోంది. ఈ వీకెండ్ లో రామాయాణ రూ.2000 కోట్ల క్లబ్ లో చేరే అవకాశముంది.

Ramayana Movie: మూవీ లవర్స్‌కు గుడ్‌ న్యూస్.. 'రామాయణ' సినిమా టికెట్ ధరలు భారీగా తగ్గింపు.. కొత్త రేట్స్ ఇవే
Ramayana Movie
Basha Shek
|

Updated on: Nov 24, 2026 | 5:13 PM

Share

నితేష్ తివారీ ‘రామాయణం’ బాక్సాఫీస్ వద్ద రూ. 2000 కోట్ల వసూళ్ల మార్కును దాటే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. దీపావళి కానుకగా నవంబర్ 05న విడుదలైన రామాయణం రిలీజైన ఒక్క రోజులోనే రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఓవరాల్ గా ఇప్పటివరకు రూ. 1700 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి అత్యధిక కలెక్షన్లు రాబ్టటిన భారతీయ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడీ రామాయణం సినిమా మూడో వారంలోకి అడుగు పెట్టింది. అక్కడక్కడ వసూళ్లు తగ్గుతున్నాయి. దీనికి తోడు సినిమా టికెట్ ధరలు కూడా ఎక్కువగా ఉండడం ఈ మూవీ కలెక్షన్ డ్రాప్స్ కు కారణమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రేక్షకులను తిరిగి సినిమా హాళ్లకు రప్పించేందుకు చిత్ర బృందం దేశవ్యాప్తంగా టిక్కెట్ల ధరలను గణనీయంగా తగ్గించింది. మంగళవారం (నవంబర్ 24) కార్తీక పౌర్ణమి సందర్భంగా రామాయణ మూవీ టికెట్ కేవలం రూ.99 కే అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే 2డీ, 3డీ, ఐమాక్స్ ఫార్మాట్లలోనే అత్యధిక డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కొన్ని ప్రీమియం ఫార్మాట్లలో ధరలు యథావిధిగానే ఉండనున్నాయి. ఈ విషయాన్ని చిత్ర బృందం తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా అధికారికంగా ప్రకటించింది. చిత్ర బృందం చేసిన ఈ ప్రకటన తరువాత, దేశంలోని చాలా సినిమా హాళ్లు ‘రామాయణం’ ప్రదర్శనల టికెట్ ధరను రూ. 99కి తగ్గించాయి.

ఇవి కూడా చదవండి

ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో, ఇంతకుముందు రూ. 300 నుంచి 400 వరకు ఉన్న 2D ప్రదర్శనల టికెట్ ధర ఇప్పుడు కేవలం రూ. 99కే లభిస్తోంది. చాలా చోట్ల ధర 50 నుంచి 60 శాతం వరకు తగ్గగా, కొన్ని సినిమా హాళ్లలో ఏకంగా 80 శాతం వరకు తగ్గించారు. రిక్లైనర్ సీట్ల వంటి ప్రీమియం టిక్కెట్ల ధరలు సుమారు రూ. 199 నుంచి రూ. 249 వరకు స్వల్పంగా పెరిగాయి. అదేవిధంగా, 3D మరియు IMAX షోల ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. ముంబై మరియు ఢిల్లీలో, గతంలో రూ. 500 పైగా ఉన్న 3D షోల టిక్కెట్ల ధరలు ఇప్పుడు రూ. 119 నుంచి రూ. 249 మధ్య ఉన్నాయి. కొన్ని స్క్రీన్‌లలో IMAX 3D ధర రూ. 250కి తగ్గగా, ఇతర స్క్రీన్‌లలో రూ. 700-800 ప్రీమియం ధరను అలాగే ఉంచారు. ‘బుక్‌మైషో’ ప్రకారం, ఈ తక్కువ ధర టిక్కెట్లు మంగళవారానికే పరిమితం కాకుండా, ఈ వారం మిగిలిన రోజులకు కూడా వర్తిస్తాయి. టిక్కెట్ల ధరలను మళ్లీ ఎప్పుడు పెంచుతారో ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం మూడవ వారంలో ఉన్న ‘రామాయణం’, భారతదేశవ్యాప్తంగా సుమారు 4000 స్క్రీన్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

రామాయణం టికెట్ కేవలం రూ.99 మాత్రమే..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us