AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సోషల్ మీడియాలో కొత్త రచ్చ.. కాక్రోచ్ పార్టీ తరహాలో “సైలెంట్ పొలిటికల్ పార్టీ” ??

ఈ ట్రెండింగ్ యుగంలో సోషల్ మీడియా పాత్ర చాలా కీలకం. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఓ వింత పోస్టర్ చర్చనీయాంశంగా మారింది. పంది ముఖాన్ని పోలిన మాస్క్‌తో కనిపిస్తున్న ఒక వ్యక్తి చిత్రంతో ఉన్న ఈ పోస్టర్లు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

సోషల్ మీడియాలో కొత్త రచ్చ.. కాక్రోచ్ పార్టీ తరహాలో సైలెంట్ పొలిటికల్ పార్టీ ??
Pig Mask Posters
Korivi Jayakumar
|

Updated on: Nov 24, 2026 | 5:05 PM

Share

ప్రస్తుతం ఉన్న ఈ ట్రెండింగ్ యుగంలో సోషల్ మీడియా పాత్ర చాలా కీలకం. ఒకప్పుడు కొత్త పరిచయాలు, సంభాషణలు, ఫోటో, వీడియో పోస్టింగ్ లకు మాత్రమే పరిమితమైన ఇది.. ఇప్పుడు వాటికే పరిమితం కాకుండా రాజకీయాలపై చర్చలు, ప్రజా సమస్యలపై నిరసనలు వ్యక్తం చేయడానికి కూడా ప్రధాన వేదికగా మారింది. ముఖ్యంగా ట్రాఫిక్, రోడ్లు, డ్రైనేజీ, కాలుష్యం, ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి అంశాలు నిత్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌ అవుతూనే ఉంటున్నాయి. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఓ వింత పోస్టర్ చర్చనీయాంశంగా మారింది. పంది ముఖాన్ని పోలిన మాస్క్‌తో కనిపిస్తున్న వ్యక్తి చిత్రంతో ఉన్న ఈ పోస్టర్లు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ‘సైలెంట్ పొలిటికల్ పార్టీ’ పేరుతో కనిపిస్తున్న ఈ ప్రచారం వెనుక అసలు ఉద్దేశం ఏంటి ? ఆ స్టోరీ ఏంటో మీకోసం ప్రత్యేకంగా..

పంది ముఖం మాస్క్‌తో పోస్టర్లు..

కాగా గత రెండు రోజులుగా పంది ముఖాన్ని పోలిన మాస్క్‌తో ఉన్న పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పోస్టర్లలో కనిపిస్తున్న మాస్క్ వెనుక ఏదైనా రాజకీయ సందేశం ఉందా? ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వ్యంగ్యంగా నిరసన తెలియజేస్తున్నారా? లేక కొత్త తరహా రాజకీయ ఉద్యమానికి ప్రచారం కల్పిస్తున్నారా? అనే ప్రశ్నలు నెటిజన్లలో వ్యక్తమవుతున్నాయి. ‘సైలెంట్ పొలిటికల్ పార్టీ’ పేరుతో సోషల్ మీడియా ఖాతాలు కనిపించడం ఈ చర్చకు మరింత ఆసక్తిని జోడించింది.

‘కాక్రోచ్ పార్టీ’ తరహాలో మరో నిరసనా?

ఇక ‘కాక్రోచ్ పార్టీ’ కూడా సోషల్ మీడియాలో మొదలై సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కొత్త పోస్టర్లను కూడా అదే కోణంలో కొందరు చూస్తున్నారు. పంది ముఖం మాస్క్‌ను ఎంచుకోవడం వెనుక ఏదైనా ప్రత్యేకమైన ప్రతీకాత్మక సందేశం ఉందా? పాలకుల పనితీరుపై నిరసన వ్యక్తం చేయడమే లక్ష్యమా? లేక ప్రజల దృష్టిని ఆకర్షించడానికి రూపొందించిన ప్రచార వ్యూహమా? అనే చర్చ సాగుతోంది. అయితే ఈ ప్రచారం వెనుక ఉన్న అసలు భావనను నిర్వాహకులు వెల్లడిస్తేనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ పోస్టర్లపై ప్రముఖ ఆన్‌లైన్ చర్చా వేదిక రెడ్డిట్ ‌లోనూ పలువురు చర్చిస్తున్నారు.

పోస్టర్ల వెనుక అసలు లక్ష్యం ఏమిటి?

ప్రస్తుతం ఈ పోస్టర్ల వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? ‘సైలెంట్ పొలిటికల్ పార్టీ’ అసలు లక్ష్యం ఏమిటి? పంది ముఖం మాస్క్ ద్వారా ఎవరిని లక్ష్యంగా చేసుకున్నారు? ఇది రాజకీయ పార్టీగా రూపుదిద్దుకోబోతోందా? లేక ప్రజా సమస్యలపై దృష్టి ఆకర్షించేందుకు చేపట్టిన ప్రచారమా? అన్న ప్రశ్నలకు ఇంకా సమాధానాలు రావాల్సి ఉంది. ఏదేమైనా సోషల్ మీడియాలో మొదలైన ఈ వింత పోస్టర్ చర్చ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీని వెనుక ఉన్న అసలు కథ ఏమిటో తెలియాలంటే నిర్వాహకుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.

ఎవరా ముసుగు మనిషి ??

Follow Us