AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tiger Prabhakar: మూడు పెళ్లిళ్లు.. ఐదుగురు పిల్లలు.. వందల సినిమాల్లో నటించిన ఈ విలన్ ఎలా చనిపోయారో తెలుసా?

కన్నడ ప్రభాకర్ అలియాస్ టైగర్ ప్రభాకర్ కొన్ని వందల సినిమాల్లో నటించారు. హీరోగానూ, విలన్ గానూ, సహాయక నటుడిగానూ మెప్పించారు. అయితే ప్రొఫెషనల్ లైఫ్ లో సక్సెస్ అయిన ఈ ట్యాలెంటెడ్ యాక్టర్ పర్సనల్ లైఫ్ లో మాత్రం బాగా స్ట్రగుల్ అయ్యాడు.

Tiger Prabhakar: మూడు పెళ్లిళ్లు.. ఐదుగురు పిల్లలు.. వందల సినిమాల్లో నటించిన ఈ విలన్ ఎలా చనిపోయారో తెలుసా?
Tiger Prabhakar
Basha Shek
|

Updated on: Nov 23, 2026 | 8:08 PM

Share

టైగర్ ప్రభాకర్.. అలియాస్ కన్నడ ప్రభాకర్.. ఈ తరం సినిమా ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చేమో కానీ.. 1980-90 దశకం ఆడియెన్స్ కు ఈ నటుడు బాగా పరిచయం. టైగర్ ప్రభాకర్ పేరుకు తగ్గట్టుగానే మంచి శరీర సౌష్టవం ఈ నటుడి సొంతం. అయితే చూడ్డానికి హీరోలా ఉండే ఈ కన్నడ నటుడు ఎక్కువగా విలన్ పాత్రలతోనే బాగా ఫేమస్ అయ్యారు. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళం, హిందీ చిత్రాల్లో ప్రతినాయకుడిగా చేశారు. తెలుగులో అయితే యుగంధర్, ఇద్దరూ అసాధ్యులే, చుట్టాలున్నారు జాగ్రత్త, బిల్లా రంగ, చట్టానికి కళ్లు లేవు, పులి బెబ్బులి, ధర్మ పోరాటం, పులి, జ్వాలా, విక్రమ్ ,పోలీస్ అధికారి, రావణ బ్రహ్మ, కిరాతకుడు, రాక్షసుడు, రాక్షస సంహారం, పసివాడి ప్రాణం, జేబు దొంగ, జగదేక వీరుడు అతిలోక సుందరి, నేటి సిద్దార్థ, కొదమ సింహం, నిప్పురవ్వ.. ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు కన్నడ ప్రభాకర్. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే విలన్ గా ప్రభాకర్ ఉండాల్సిందే. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్ గానే నిలిచాయి. ఓవరాల్ గా తన సినిమా కెరీర్ లో అన్ని భాషల్లో కలిపి సుమారు 450 సినిమాల్లో నటించారు ప్రభాకర్. తన యాక్టింగ్ ట్యాలెంట్ కు ప్రతీకగా ఎన్నో అవార్డులు, బిరుదులు, ప్రశంసలు అందుకున్నారు ప్రభాకర్.

ప్రభాకర్ కేవలం నటుడిగానే కాకుండా. దర్శకుడిగా, రచయితగా, సంగీత దర్శకుడిగా కూడా రాణించారు. ముఖ్యంగా తన సొంత భాష కన్నడలో పది సినిమాలకు పైగా దర్శకత్వం వహించారు. సినిమాల్లో స్టార్ నటుడిగా ఓ వెలుగు వెలిగిన ప్రభాకర్ వ్యక్తిగత జీవితంలో మాత్రం తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా వైవాహిక జీవితం విషయంలో ఆయన తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభాకర్ ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని ప్రచారం లో ఉంది. మొదటి భార్య మేరీ అల్ఫోన్సాతో ఆయనకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు కుమార్తెలు భారతి, గీత, ఒక కుమారుడు వినోద్ ప్రభాకర్. వీరిలో వినోద్ ప్రభాకర్ ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో నటుడిగా రాణిస్తున్నారు. ఆ తర్వాత కన్నడ నటి జయమాలను వివాహం చేసుకున్నారు ప్రభాకర్. వీరికి సౌందర్య అనే కుమార్తె ఉన్నట్లు సమాచారం. అయితే ఈ వివాహం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. ఆపై నటి అంజును వివాహం చేసుకున్నారు. వీరికి అర్జున్ అనే కుమారుడు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బంధం కూడా ఎక్కువ రోజులు నిలవలేదు.

ఇదిలా ఉంటే సినిమాల్లో ఎంతో ఫిట్ గా కనిపించే టైగర్ ప్రభాకర్ జీవితంలో చివరి రోజుల్లో తీవర ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి. ముఖ్యంగా ఓ బైక్ ప్రమాదం తర్వాత ఆయన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిందని తెలుస్తోంది. 2001 మార్చి నెలలో కామెర్ల వ్యాధి చికిత్స కోసం బెంగళూరులోని మాల్యా ఆసుపత్రిలో చేరారు ప్రభాకర్. చికిత్స పొందుతున్న సమయంలో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. చివరకు 2001 మార్చి 25న ఆయన కన్నుమూశారు. అప్పటికి ఆయన వయసు 52 సంవత్సరాలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us