Ananya Sharma: అతన్ని పిచ్చిగా ప్రేమించా.. కానీ ఆ కారణంతో.. లవ్ బ్రేకప్ స్టోరీ బయట పెట్టిన అనన్య శర్మ
30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది అనన్య శర్మ. తన అందం, అభినయంతో పాటు ఎక్స్ ప్రెషన్స్ తోనూ యూత్ ను కట్టి పడేసింది. ఇప్పుడీ ముద్దుగుమ్మ వరుసగా సినిమాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అనన్య తన బ్రేకప్ స్టోరీ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.

30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ తో ఓవర్ నైట్ ఫేమ్ తెచ్చుకుంది అనన్య శర్మ. అందులో ఆమె అందం, అభినయం అలాగే ఎక్స్ ప్రెషన్స్ కు కుర్రకారు అందరూ ఫిదా అయిపోయారు. కాగా చెన్నైలో ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న సమయంలోనే షార్ట్ ఫిలిమ్స్ లో నటించడం మొదలు పెట్టింది అనన్య. యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించింది. చాయ్ బిస్కెట్ , బాయ్స్ ఫార్ములా తదితర యూట్యూబ్ ఛానల్స్ లోని షార్ట్ ఫిలిమ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇదే క్రమంలో 30 వెడ్స్ 21 అనే సిరీస్ తో చాలా మందికి ఫేవరెట్ గా మారిపోయిందీ అందాల తార. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషలో విడుదలైన లాలీపాప్ అనే కవర్ సాంగ్ కూడా అనన్యకు మంచి పేరు వచ్చింది. వెబ్ సిరీస్ లతో పాటు లక్కీ భాస్కర్ వంటి సినిమాల్లోనూ మెరిసింది అనన్య. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మరో ఆసక్తికరమైన సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. అనన్య శర్మ మెయిన్ లీడ్ లో నటించిన సినిమా ‘హై’. ఇప్పటికే అన్ని హంగులు పూర్త చేసుకున్న ఈ సినిమా నవంబర్ 27న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో విస్తృతంగా పాల్గొంటోంది. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఇదే క్రమంలో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటోంది. తాజాగా ఓ ఛానెల్ ఇంటర్వ్యూకు హాజరైన అనన్య తన లవ్ బ్రేకప్ గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.
‘కాలేజీ రోజుల్లో ఒక అతన్ని ప్రేమించాను. అయితే అప్పట్లో కొన్ని అనుకొని పరిస్థితుల వల్ల ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయాం. ఇదంతా తెలిసి తెలియని వయసులో జరిగింది. ఒక వేళ అతను మళ్లీ కనిపిస్తే హ్యాపీనే. ఇప్పటికీ నాకు అతనిపై ఒక ఎఫెక్షన్ ఉంది. అతన్ని మళ్లీ కలిసినా ఓకే. కానీ అతను మళ్లీ నా లైఫ్ లోకి వచ్చే ఛాన్స్ మాత్రం ఉండదు. ఒక రీజన్ వల్ల మేమిద్దరం విడిపోయాం. లైఫ్ లో మేము ఎవరి దారిలో వాళ్లు వెళ్లిపోయాం. అయినా అతను మళ్లీ వచ్చి అడగడు’ అని చెప్పుకొచ్చింది అనన్య.
అనన్య శర్మ లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
ఇక తనకు కాబోయే వాడిలో ఉండే క్వాలిటీస్ గురించి ఇలా చెప్పుకొచ్చింది అనన్య.. ‘ చాలా దయ ఉండాలి. జంతువులు అంటే ఇష్టం ఉండాలి. సహనం ఉండాలి. లైఫ్ లో క్లారిటీ ఉండాలి. తను ఉద్యోగం చేయను ఇంట్లో ఉంటాను అన్నా పర్లేదు కానీ లైఫ్ లో ఒక క్లారిటీ ఉండాలి ఏం చేయాలి అని. లుక్స్ అనేవి టెంపరరీ. ఓ పదేళ్ల తర్వాత ఆ లుక్స్ మారి పోతాయి. నాకంటే కొంచెం హైట్ ఉంటే చాలు’ అని పేర్కొంది అనన్య. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




