AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jayasudha: తెలుగులో నా ఫస్ట్ సినిమా అదే.. అప్పుడు రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారంటే.. జయసుధ..

టాలీవుడ్ ఇండస్ట్రీలో విలక్షణ నటి అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు జయసుధ. దశాబ్దాల సినీ ప్రయాణంలో అప్పట్లో కథానాయికగా, ఆ తర్వాత సహయ నటిగా ఎన్నో వందలాది చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇప్పటికీ తన నటనతో వెండితెరపై సందడి చేస్తున్నారు. జయసుధ తన తొలి పారితోషికం గురించి ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. బాలచందర్ దర్శకత్వంలో హీరోయిన్‌గా నటించిన ఊమై విళిగళ్ సినిమాకు ఎంత రెమ్యునరేషన్ వచ్చిందనే విషయాన్ని వివరించారు.

Jayasudha: తెలుగులో నా ఫస్ట్ సినిమా అదే.. అప్పుడు రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారంటే.. జయసుధ..
Actress Jayasudha
Rajitha Chanti
|

Updated on: Nov 23, 2026 | 2:22 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో దశాబ్దాలుగా తనదైన నటనతో అలరిస్తున్నారు జయసుధ. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ జీవితంలో తొలి పారితోషికం, దానికి సంబంధించిన మధుర జ్ఞాపకాలు, అలాగే తన ఆర్థిక ప్రయాణం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఆమె తన మొదటి తెలుగు సినిమా పండంటి కాపురంకు ఎంత వచ్చిందో గుర్తు లేకపోయినా, బాలచందర్ దర్శకత్వంలో హీరోయిన్‌గా నటించిన తన తొలి సినిమాకు లభించిన పారితోషికం మాత్రం ఆమె మనసులో పదిలంగా ఉంది. తమిళంలో ఊమై విళిగళ్ అనే చిత్రంలో జయసుధ హీరోయిన్‌గా నటించారు. ఆ సినిమా విడుదల కానప్పటికీ, ఆమెకు అప్పట్లో రూ.5,000 పారితోషికంగా లభించింది. ఆ రోజుల్లో ఆ మొత్తం చాలా పెద్ద విషయమని జయసుధ గుర్తు చేసుకున్నారు. ఆ రూ.5,000 చెక్‌ను అందుకున్న రోజును ఆమె ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు. ఆ రోజు తన తండ్రి ఆ చెక్‌ని తీసుకుని, కుటుంబ సభ్యులతో కలిసి చెన్నైలోని మెరీనా బీచ్‌కు వెళ్లారు. అక్కడ తన తండ్రి, తల్లి, ఇతర కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆ మొత్తాన్ని గురించి గొప్పగా మాట్లాడుకుని, అక్కడే భోజనం చేసి, బీచ్ ఒడ్డున పడుకుని గడిపిన తీపి జ్ఞాపకాలను ఆమె గుర్తు చేసుకున్నారు.

తమ ఇల్లు చిదంబరం స్టేడియం, బెల్స్ రోడ్, ట్రిప్లికేన్ ప్రాంతంలో ఉండటం వల్ల మెరీనా బీచ్ తమకు చాలా దగ్గరని, కేవలం అరగంట నడక దూరంలో ఉందని ఆమె వివరించారు. ప్రతి శనివారం లేదా ఆదివారం సాయంత్రం కుటుంబం మొత్తం మెరీనా బీచ్‌కు వెళ్లి, రాత్రంతా అక్కడే గడిపి, తెల్లవారుజామున సూర్యోదయాన్ని చూసి తిరిగి ఇంటికి వచ్చే ఆ ఆనంద క్షణాలు తనకు ఇప్పటికీ గుర్తు ఉన్నాయని జయసుధ అన్నారు. తన కెరీర్ తొలినాళ్లలో ఆర్థిక వ్యవహారాల గురించి తాను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదని జయసుధ తెలిపారు. తన తండ్రి అన్నింటినీ చూసుకునేవారని, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేసేదానినని ఆమె చెప్పారు. డబ్బు విషయంలో తాను ఎప్పుడూ లోతుగా ఆలోచించలేదని, అది తన తండ్రి బాధ్యతగా భావించేదానినని అన్నారు. అయితే, సుమారు 35 నుంచి 40 ఏళ్ల వయస్సు వచ్చినప్పుడు, బ్యాంకింగ్ లావాదేవీలు, ఆర్థిక విషయాలను స్వయంగా నేర్చుకోవాలని నిర్ణయించుకున్నానని ఆమె వెల్లడించారు. అంతకుముందు బ్యాంక్‌కి వెళ్లినా, ఏదో సంతకం పెట్టి వచ్చేసేదని, కానీ 40 ఏళ్ల వయస్సులో పూర్తి అవగాహనతో బ్యాంకింగ్ నేర్చుకోవడం ప్రారంభించానని జయసుధ అన్నారు.

తనను ఒక నటిగా తీర్చిదిద్దిన శిల్పి ఎవరు అని ప్రశ్నించగా, లెజెండరీ దర్శకులైన దాసరి నారాయణరావు, కె. రాఘవేంద్రరావు, బాలచందర్ వంటి అనేక మంది గొప్ప దర్శకులతో పనిచేశానని జయసుధ అన్నారు. తమిళం, కన్నడ, మలయాళం, తెలుగు, హిందీతో సహా అనేక భాషల్లో నటించానని పేర్కొన్నారు. హిందీలో అమితాబ్ బచ్చన్‌తో నటించిన సినిమాతో సహా మూడు సినిమాలు చేశానని, సూర్యవంశం వంటి చిత్రాలలో కూడా నటించానని గుర్తు చేసుకున్నారు. తన కెరీర్ ఆరంభంలో ఒకేసారి నాలుగు, ఐదు సినిమాలు చేస్తూ నిరంతరం పనిచేస్తూనే నేర్చుకున్నానని, ఆ జర్నీనే తన పాఠశాల అని జయసుధ అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 1965లోనే లక్షలతో తీసిన బాలనాగమ్మ సినిమా.. షూటింగ్ పూర్తైన ఎందుకు రిలీజ్ కాలేదంటే..

ఎక్కువ మంది చదివినవి : Cinema : మెంటలెక్కించే ట్విస్టులు.. క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఓటీటీని షేక్ చేస్తున్న 7 ఎపిసోడ్స్..

Follow Us