AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken Curry: చుక్క నీరు లేకుండా చిక్కటి గ్రేవీతో అదిరిపోయే చికెన్ కర్రీ

చికెన్ కర్రీ అంటే ప్రతి ఇంట్లోనూ వండుకునేదే, కానీ ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా కాస్త కొత్తగా, చిక్కటి గ్రేవీతో వండితే ఆ రుచే వేరు. ముఖ్యంగా కూరలో ఒక్క చుక్క కూడా నీళ్లు పోయకుండా, చికెన్ నుండి వచ్చే సహజసిద్ధమైన నీటితోనే ఉడికిస్తే ముక్క ఎంతో జ్యూసీగా, మృదువుగా తయారవుతుంది. వంట రాని వారు, బ్యాచిలర్స్ సైతం ఎంతో సులభంగా చేసుకోగలిగే ఈ రుచికరమైన చికెన్ కర్రీ అన్నం, బగారా రైస్, చపాతీ ఇలా దేనిలోకైనా అద్భుతంగా కుదురుతుంది.

Phani CH
|

Updated on: Nov 23, 2026 | 2:03 PM

Share
కావలసిన పదార్థాలు: చికెన్ 1 కేజీ, నూనె అర కప్పు, పచ్చిమిర్చి 3, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అర కప్పు, టమాటాలు 2 (మీడియం సైజు), అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పెరుగు అర కప్పు, పసుపు పావు టేబుల్ స్పూన్, ఉప్పు 1 పావు టేబుల్ స్పూన్లు (రుచికి సరిపడా), కారం 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 3 రెమ్మలు, చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి తురుము 1 టేబుల్ స్పూన్, కసూరి మేతి 2 టేబుల్ స్పూన్లు.

1 / 5
ముందుగా కేజీ చికెన్‌ను నిమ్మరసం లేదా వెనిగర్ వేసిన నీటితో రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా కడగడం వల్ల ఎలాంటి నీచు వాసన లేకుండా చికెన్ తాజాగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టి అర కప్పు నూనె వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి వేయించి, ఆపై సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి.

2 / 5
ఉల్లిపాయలు చక్కగా వేగిన తర్వాత తరిగిన రెండు టమాటా ముక్కలు వేసి మెత్తని గుజ్జులా మగ్గేవరకు ఉడికించాలి. ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు సన్నని మంటపై వేయించాలి. ఇందులో అర కప్పు చిలికిన పెరుగు వేసి బాగా కలుపుతూ వేయించాలి. పెరుగు వేయడం వల్ల గ్రేవీకి కమ్మదనంతో పాటు చికెన్ ముక్కలు ఎంతో మృదువుగా ఉడుకుతాయి.

3 / 5
ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మసాలాల పచ్చివాసన పోయేవరకు వేయించాలి. అనంతరం శుభ్రం చేసిన చికెన్ ముక్కలు, కరివేపాకు రెమ్మలు వేసి మసాలా అంతా పట్టేలా కలిపి, మూతపెట్టి సన్నని మంటపై పది నిమిషాలు ఉడికించాలి. ఈ సమయంలో చికెన్‌లోని నీరంతా బయటకు ఊరుతుంది.

4 / 5
ఆ తర్వాత మూత తీసి రుచికి సరిపడా మరో పావు టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం వేసి కారం పచ్చివాసన పోయేవరకు ఉడికించాలి. చివరగా ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, ఎండు కొబ్బరి తురుము వేసి కలిపి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి. నూనె పైకి తేలిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కసూరి మేతిని చేత్తో నలిపి వేసి ఒక్క నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే గుమగుమలాడే చికెన్ కర్రీ సిద్ధం.

5 / 5
Follow Us
చుక్క నీరు లేకుండా చిక్కటి గ్రేవీతో అదిరిపోయే చికెన్ కర్రీ

ఆ ఒక్క సినిమాతో మా ఆస్తులన్నీ పోయాయి..
ఆ ఒక్క సినిమాతో మా ఆస్తులన్నీ పోయాయి..
వడలు నూనె పీల్చకుండా హోటల్ స్టైల్‌లో రావాలంటే ఇలా చేయండి..

మూడు చప్పరించి తింటే.. పరిగెత్తించి మరీ ఆ వ్యాధులను తరిమేస్తుంది

బిజీ జీవితంలో ఫిట్‌నెస్ కష్టమా? ఈ మినీ వాక్ ట్రై చేయండి..!

అరెరే సింక్ నుంచి దుర్వాసన పోగొట్టడం ఇంత సింపులా

సాయంత్రం పూట పండ్లు తింటున్నారా? ఆరోగ్యంపై పడే ప్రభావం ఇదే!

ఇడ్లీ, దోశ, అన్నంలోకి అదిరిపోయే పుదీనా చట్నీ..

మీ కూరలు రుచిగా రావాలంటే ఈ సీక్రెట్ పొడిని ఒక్క సారి వేసి చూడండి

నీటికి ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా? బాటిళ్లపై ఆ తేదీ ఎందుకు వేస్తారు?