AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ESI కార్డు ఉన్నవారికి అలర్ట్.. ఇకపై నేరుగా అకౌంట్లోకి డబ్బులు.. రిలీఫ్ వచ్చేసింది..

ఈఎస్ఐ పరిధిలోకి వచ్చేేేేేేేవారికి అలర్ట్. కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇక నుంచి ఈఎస్ఐ కార్డుకు ఆధార్, బ్యాంక్ అకౌంట్ లింక్ చేయడం తప్పనిసరి చేసింది. ఇక నుంచి ప్రయోజనాలకు సంబంధించిన నగదును నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయనుంది.

Venkatrao Lella
|

Updated on: Nov 23, 2026 | 1:12 PM

Share
మీకు ఈఎస్‌ఐ నెంబర్ ఉందా..? అయితే ఇది మీ కోసమే. కేంద్ర కార్మికశాఖ కీలక మార్పులు చేసింది.  ఈఎస్‌ఐ పరిధిలోకి వచ్చే కార్మికులు, ఉద్యోగులకు వైద్య సేవలు మెరుగ్గా అందించాలనే లక్ష్యంతో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర బీమా-1950 స్థానంలో కార్మిక రాజ్య బీమా నిబంధనలు -2026 అమల్లోకి తీసుకొచ్చింది. నవంబర్ 20వ తేదీ నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చేశాయి.

1 / 5
ఇక నుంచి ఈఎస్‌ఐ సేవలన్నీ డిజిటల్ విధానంలో జరగనున్నాయి. గుర్తింపు కార్డుల జారీ నుంచి క్లెయిమ్ వరకు అన్నీ ఆన్‌లైన్ ద్వారా జరగనున్నాయి. ప్రసూతి, అనారోగ్య ప్రయోజనాలు పొందేందుకు ప్రత్యేకంగా క్లెయిమ్ కోసం దరఖాస్తు చేయాల్సిన పని లేదు. యజమాని సమర్పించే క్లెయిమ్,  వైద్య ధ్రువీకరణ పత్రాల ఆధారంగా నేరుగా ఉద్యోగి బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేయనున్నారు.

2 / 5
ఇందుకోసం ఈఎస్ఐ కార్డుకు ఆధార్, బ్యాంక్ ఖాతా లింక్ చేయడాన్ని కేంద్ర కార్మికశాఖ తప్పనిసరి చేసింది. అయితే కొత్తగా ఈఎస్ఐ పరిధిలోకి వచ్చినవారు 9 నెలల చందా కాలాన్ని పూర్తి చేసిన తర్వాత ఈ ప్రయోజనాలు పొందవచ్చు. యజమాన్యాలకే ఉద్యోగుల నమోదు బాధ్యతను కేంద్రం అప్పగించింది. దీంతో కంపెనీలే ఆన్‌లైన్‌లో దరఖాస్తను సమర్పించాల్సి ఉంటుంది

3 / 5
ఉద్యోగి ఫొటో, కటుంబసభ్యుల వివరాలతో యాజమాన్యాలు దరఖాస్తును ఆన్‌లైన్‌లో సమర్పించాలి. అనంతరం డిజిటల్ విధానంలో ఈఎస్ఐ కార్డ్ జనరేట్ అవుతుంది. ప్రతీ నెలా ముగిసిన 15 రోజుల్లోగా చందాను యాజమాన్యాలు దాఖలు చేయాలి. బకాయిలపై నెలకు ఒక శాతం జరిమానా విధించనున్నారు.

4 / 5
అలాగే కార్మికుడు మరణిస్తే కుటుంబసభ్యులకు మూడు నెలల్లోగా ప్రయోజనాలను చెల్లించాలి. అలాగే వైద్య ప్రయోజనాలు పొందాలంటే వైద్యుల నుంచి ధృవీకరణ పత్రాలను తప్పనిసరి చేశారు.  టీబీ, క్యాన్సర్‌, ఎయిడ్స్‌, గుండె జబ్బులు, దీర్ఘకాలిక మూత్రపిండాల వైఫల్యం, పక్షవాతం వంటి 34 తీవ్రమైన వ్యాధుల నుంచి కూడా పరిధిలో చేర్చారు.

5 / 5
Follow Us