గూగుల్‌లో మీ మొబైల్ నెంబర్, అడ్రస్ కనిపిస్తుందా..? ఒకే క్లిక్‌తో తొలగించుకోండి..

Venkatrao Lella

Images: Pinterest

17 NOV 2026

ప్రస్తుతం డిజిటల్ కాలంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోతుంది. దీంతో గూగుల్ ఉపయోగించడం తప్పనిసరి. గూగుల్‌తో మీ  ఫోన్ నెంబర్, అడ్రస్, ఈమెయిల్ లాంటివి కనిపిస్తుంటే అవి కనిపించకుండా చేసుకోవచ్చు.

వినియోగదారులకు భద్రత కల్పించేందుకు రిజల్ట్స్ అబౌట్ యూ అనే ఫీచర్‌ను గూగుల్ తీసుకొచ్చింది. గూగుల్‌లో కనిపిస్తున్న మీ వ్యక్తిగత సమాచారంను తొలగించమని ఈ ఫీచర్ ద్వారా అభ్యర్ధించవచ్చు. ఇదెలా అంటే.

మీ స్మార్ట్‌ఫోన్ లేదా బ్రౌజర్‌లో గూగుల్ అకౌంట్‌కు లాగిన్ అవ్వండి. ఆ తర్వాత కుడివైపున కనిపించే మీ ప్రొఫైల్ ఫొటోపై క్లిక్ చేయండి.

అక్కడ మీ గురించిన ఫలితాలు అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఫస్ట్ టైమ్ ఈ ఫీచర్ వాడుతుంటే గెట్ స్టార్టెడ్‌పై క్లిక్ చేయండి. అక్కడ పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్, అడ్రస్ నమోదు చేయండి.

అనంతరం పాతబడిన కంటెంట్ తొలగింపు లేదా వ్యక్తి సమాచారం తొలగింపు అభ్యర్థన పేజీకి వెళ్లండి. అక్కడ సంబంధిత వెబ్ పేజీ URL నమోదు చేయండి

అనంతరం మీ రిక్వెస్ట్‌ను సమర్పించండి. గూగుల్ మీ రిక్వెస్ట్‌ను పరిశీలించి మీ వ్యక్తిగత వివరాలు డిలీట్ చేస్తుంది. దీంతో గూగుల్‌లో మీ వివరాలు కనిపించవు.

వినియోగదారుల గోప్యతను కాపాడేందుకు గూగుల్ ఈ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. మీ వ్యక్తిగత సమాచారం వీక్షించడం లేదా సెర్చ్ నుంచి తొలగించడం కోసం ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

ప్రస్తుత కాలంలో సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రజల నెంబర్లను సేకరించి స్పామ్ కాల్స్, మెస్సేజ్‌లు చేసి డబ్బులు కాజేస్తున్నారు. లక్షలాది మంది సైబర్ మోసాల బారిన పడుతున్నారు.

గూగుల్‌లో మీ పేరు సెర్చ్ చేయడం ద్వారా వ్యక్తిగత వివరాలను తెలుసుకునే అవకాశముంది. మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ వంటివి తెలుసుకోవచ్చు. దీంతో గూగుల్ ఈ ఫీచర్ ప్రవేశపెట్టింది.